బిజినెస్

విదేశీ ఆస్తుల వివరాలివ్వను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా రుణాల ఎగవేత కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. తన విదేశీ ఆస్తుల వివరాలను అడిగే హక్కు బ్యాంకులకు లేదని సుప్రీం కోర్టులో మాల్యా ఓ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ఈ నెల 21లోగా మాల్యా, ఆయన కుటుంబ సభ్యులకు దేశ, విదేశాల్లో ఉన్న మొత్తం ఆస్తుల వివరాలను వెల్లడించాలని అత్యున్నత న్యాయస్థానం ఇంతకుముందు ఆదేశించినది తెలిసిందే. 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడి విదేశాలకు పారిపోయాడన్న కేసులో బ్యాంకుల డిమాండ్ మేరకు సుప్రీం పై ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మాల్యా తాజా అఫిడవిట్ దాఖలైంది. ఇందు లో తాను ఓ ఎన్నారైనని, తన భార్య, ముగ్గురు సంతానం అందరూ కూడా అమెరికా పౌరులని, తమ ఆస్తులను వెల్లడించే అవసరం తమకు లేదని మాల్యా పేర్కొన్నారు. అంతేగాక తనకిచ్చిన రుణాలన్నీ కూడా తన విదేశీ ఆస్తులను చూసి ఇచ్చినవి కాదన్నారు. ఇదిలావుంటే జూన్ 26న సీల్డ్ కవర్‌లో తన ఆస్తుల గురించిన సమాచారాన్ని సమర్పించేందుకు సుప్రీం కోర్టు అనుమతిని మాల్యా కోరారు.
ఇడి మరిన్ని చర్యలు
రూ. 900 కోట్ల ఐడిబిఐ బ్యాంక్ రుణంలో రూ. 430 కోట్లతో విదేశాల్లో ఆస్తులను మాల్యా కొన్నారంటూ మనీ లాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. మాల్యాను భారత్‌కు త్వరగా రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఓ లేఖను కూడా రాసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ) ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌తో చర్యలు తీసుకోవాలంది.
డిఆర్‌టి అధికారాలపై సవాల్
బెంగళూరు: విజయ్ మాల్యాతో 75 మిలియన్ డాలర్ల పే ప్యాకేజి ఒప్పందాన్ని చేసుకున్న నేపథ్యంలో 40 మిలియన్ డాలర్లను డిపాజిట్‌గా చేయాలని డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డిఆర్‌టి) ఆదేశించడాన్ని డియాజియో సవాల్ చేసింది. ఆ అధికారం డిఆర్‌టికి లేదంటోంది. భారత్ వెలుపల ఈ ఒప్పందం జరిగిందని, ఇది డిఆర్‌టి పరిధిలో లేని వ్యవహారమంది.