బిజినెస్

అత్యధిక ఉద్యోగినులున్న సంస్థల్లో టిసిఎస్ యుకె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: మహిళా ఉద్యోగులకు సంబంధించి ది టైమ్స్ ప్రచురించిన జాబితాలో భారతీయ ఐటిరంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) టాప్-50 సంస్థల్లో చోటు సంపాదించింది. బ్రిటన్‌లో అత్యధిక ఉద్యోగిణులున్న సంస్థల్లో టిసిఎస్ కూడా ఉందని ది టైమ్స్ పేర్కొంది. టిసిఎస్‌లో ప్రపంచవ్యాప్తంగా లక్షకుపైగా మహిళలు పనిచేస్తున్నారు. సంస్థ మొత్తం ఉద్యోగుల్లో ఇది మూడో వంతుకు సమానం. కాగా, ఐటి పరిశ్రమలో మహిళలకు మరింతగా చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా టిసిఎస్ ముందుకెళ్తుందని సంస్థ యుకె, ఐర్లాండ్ విభాగం హెచ్ ఆర్ డైరెక్టర్ నుపూర్ సింగ్ మల్లిక్ అన్నారు.