బిజినెస్

సెనె్సక్స్ 28 పాయింట్లు వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 20: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 27.82 పాయింట్లు పెరిగి 25,844.18 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ యథాతథంగా ముగిసింది. అతి స్వల్పంగా 0.05 పాయింట్ల మార్పుతో 7,914.75 వద్ద స్థిరపడింది. నిజానికి అంతకుముందు నాలుగు రోజుల్లో సెనె్సక్స్ 1,142.52 పాయింట్లు, నిఫ్టీ 359.50 పాయింట్లు పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం ఆరంభంలోనూ సెనె్సక్స్ 137.47 పాయింట్లు, నిఫ్టీ 35.70 పాయింట్ల మేర లాభాల్లో కదలాడాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో పోటెత్తిన ముడి చమురు సరఫరాతో పడిపోయిన ధరలు, విదేశీ మదుపరుల నుంచి తగ్గిన పెట్టుబడుల మధ్య సూచీలు తీవ్ర ఆటుపోట్లకు లోనయ్యాయి. ఇకపోతే బిఎస్‌ఇలో మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, విద్యుత్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.