బిజినెస్

‘రెపో రేటు పావు శాతం తగ్గొచ్చు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఆగస్టు 9న జరిపే ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో రేటును పావు శాతం తగ్గించే అవకాశాలున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ అంచనా వేసింది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, పారిశ్రామికోత్పత్తి పడిపోతుండటం, ఈసారి వర్షాలు సమృద్ధిగానే కురిసే వీలుండటం మధ్య ఆర్‌బిఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించవచ్చని అభిప్రాయపడింది. ఈ నెల ఆరంభంలో జరిపిన ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో రేటును ఆర్‌బిఐ పావు శాతం తగ్గించినది తెలిసిందే.