బిజినెస్

ప్రమాదంలో దోహా అభివృద్ధి అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైరోబి/న్యూఢిల్లీ, డిసెంబర్ 16: ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) దోహా అభివృద్ధి అజెండా (డిడిఎ) ప్రమాదంలోకి జారుకుంటోదన్న ఆందోళనను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం వ్యక్తం చేశారు. ఇక్కడ జరుగుతున్న డబ్ల్యుటిఒ 10వ మంత్రిత్వ స్థాయి ప్లీనరీ సమావేశాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ వాణిజ్యంలో అసమానత్వం కనిపిస్తోందని, ఇది దోహా అభివృద్ధి అజెండాకు నష్టం కలిగిస్తున్న సంకేతాలున్నాయని అభిప్రాయపడ్డారు. ఇదిలావుంటే ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దడానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’తో పెట్టుబడులు భారీగా తరలి వస్తున్నాయన్నారు. దేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డిఐ) వృద్ధి చోటుచేసుకుందని రాజ్యసభకు ఇచ్చిన ఓ లిఖితపూర్వక సమాధానంలో నిర్మలా సీతారామన్ తెలిపారు.

టమోటా, మామిడి ఎగుమతులపై ‘జపాన్’ అధ్యయనం
మదనపల్లె, డిసెంబర్ 16 : రాష్ట్రంలో టమోటా, మామిడి పంటలతోపాటు ఉద్యానవన, వ్యవసాయ, మార్కెటింగ్‌లపై జపాన్ దేశం నిప్పోన్‌కోయి కంపెనీ డైరెక్టర్ ఇష్‌జకియోషియకి నేతృత్వంలోని బృందం చిత్తూరు జిల్లాలో అధ్యయనం చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల పర్యటనకై ప్రత్యేకంగా నాలుగు బృందాలు వచ్చినట్లు ఇష్‌జకియోషియకి మార్కెటింగ్ కార్యదర్శి జగదీష్‌కు బుధవారం వెల్లడించారు. కాగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మార్కెటింగ్, వ్యవసాయ ఉత్పత్తుల యంత్రాల సహకారం అందించేందుకు ఈ అధ్యయనం జరుగుతోందని జపాన్ కంపెనీ డైరెక్టర్ వెల్లడించారు. ఇందులో భాగంగా బుధవారం మదనపల్లె మార్కెట్‌యార్డును సందర్శించారు. రైతులు పంటను తీసుకొచ్చే విధానం, వేలం పాటలు, గ్రేడింగ్, ఎగుమతుల వివరాలు సేకరించారు. అంతేకాకుండా మామిడిపై కూడా తూర్పు మండలాల్లో అధ్యయనం చేస్తున్నామన్నారు.