బిజినెస్

‘టాక్స్ హెవెన్’ ముద్ర అవమానకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ‘పన్ను ఎగవేతకు స్వర్గ్ధామాలు’ (టాక్స్ హెవెన్స్) అనే ముద్ర వేయడంపై కొన్ని చిన్న దేశాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇది చాలా అవమానకరమైన పదమని భారత్‌లాంటి దేశాలకు ఆ దేశాలు నిరసన తెలియజేయడమే కాకుండా నల్లధనంపై ఆ దేశాలు జరుపుతున్న దర్యాప్తులకు సహకరించబోమని హెచ్చరికలు చేశాయి. భారతీయులు రహస్యంగా దాచుకున్న ధనాన్ని వెలికి తీయడం కోసం ఈ దేశాల సహాయాన్ని కోరిన నేపథ్యంలో ఆ దేశాలు తమను పన్ను ఎగవేతకు స్వర్గ్ధామాలుగా అనివర్ణించడంపై అన్యంతరం వ్యక్తం చేస్తుండడంతో న్యాయపరమైన సాయాన్ని కోరుతూ అభ్యర్థనలు పంపేటప్పుడు ఆ పదాన్ని ఉపయోగించవద్దంటూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) భారతీయ దర్యాప్తు ఏజన్సీలను ఆదేశించింది. నల్లధనానికి చెందిన కేసుల దర్యాప్తులో భాగంగా భారతీయ ఏజన్సీలు సాయం కోరిన దేశాల్లో కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్, నెవిస్, ఐల్ ఆఫ్ మ్యాన్, కుక్ ఐలాండ్స్, బ్రిటీష్ వర్జీన్ దీవులు, సమోవా, నౌరూలాంటి చిన్న దేశాలున్నాయి. తమను ‘పన్ను ఎగవేతదారులకు స్వర్గ్ధామాలు’గా అభివర్ణించడంపై వీటిలో కొన్ని దేశాలు అభ్యంతరం తెలియజేసినట్లు ఒక అధికారి చెప్పారు. అక్రమంగా దాచి ఉన్న నిధుల వెలికితీత కేసుల దర్యాప్తులో భారత్‌కు, ప్రపంచంలోని ఇతర దేశాల మధ్య పన్ను సమాచారం మార్పిడికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖలో నోడల్ ఏజన్సీ అయిన సిబిడిటి దీనికి సంబంధించి ఇటీవల ఒక ఆదేవాన్ని జారీ చేసింది. ఆ విభాగానికి చెందిన ఫారిన్ టాక్స్, టాక్స్ రిసెర్చ్(ఎఫ్‌టి అండ్ టిఆర్) విభాగం సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి సంబంధించిన ప్రోటోకాల్స్‌ను రూపొందిస్తూ ఉంటుంది.
‘టాక్స్ హెవెన్’లాంటి భాషను ఉపయోగించడం పట్ల చాలా దేశాలు అభ్యంతరం తెలియజేసినందున పన్ను అధికారులు అలాంటి పదాన్ని ఉపయోగించడం పట్ల అభ్యంతరం చెప్పడమే కాకుండా కొన్ని కేసులకు సంబంధించి సమాచార మార్పిడి లేఖల్లో ఆ పదాన్ని ఉపయోగిస్తున్నందున సమాచారాన్ని ఇవ్వడానికి సైతం నిరాకరిస్తున్నాయని, అందువల్ల పన్ను అధికారులు అలాంటి భాషను ఉపయోగించడం మానుకోవాలని సిబిడిటి ఇటీవల జారీ చేసిన ఆ లేఖలో పేర్కొన్నారు.