బిజినెస్

మార్కెట్‌కు ‘మాన్‌సూన్’ హుషారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 11: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. గత వారం వరుసగా రెండు రోజులపాటు నష్టాలకే పరిమితమైన సూచీలు ఈసారి వర్షపాతం ఆశాజనకంగా ఉంటుందన్న అంచనాల మధ్య లాభాల్లోకి వచ్చాయి. అలాగే జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి ఈ వారం ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు విడుదలవుతున్న క్రమంలో చివరి రెండు గంటల్లో ఐటి రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ క్రమంలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 348.32 పాయింట్లు పుంజుకుని తిరిగి 25వేల స్థాయికి ఎగువన 25,022.16 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 116.20 పాయింట్లు ఎగిసి మళ్లీ 7,600 మార్కును అధిగమించి 7,671.40 వద్ద స్థిరపడింది. టెలికామ్, పవర్, ఆటో, ఐటి, పరిశ్రమలు, మెటల్, యుటిలిటీస్, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్ల విలువ 3.89 శాతం నుంచి 1.70 శాతం పెరిగింది. ఇక అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో చైనా సూచీ 1.64 శాతం పెరిగితే, హాంకాంగ్ 0.35 శాతం, తైవాన్ 0.25 శాతం, సింగపూర్ 0.03 శాతం మేర పెరిగాయి. జపాన్ 0.09 శాతం, దక్షిణ కొరియా 0.44 శాతం చొప్పున నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్ 0.26 శాతం, జర్మనీ, 0.67 శాతం లాభపడ్డాయి. బ్రిటన్ మాత్రం 0.04 శాతం పడిపోయింది.
విదేశీ మదుపరుల ఆసక్తి
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో పెట్టుబడులకు విదేశీ మదుపరులు భారతీయ స్టాక్ మార్కెట్లను అత్యంత అనువైనవిగా భావిస్తున్నారని ఓ నివేదిక తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో పెట్టుబడులు లాభదాయ కమని విదేశీ మదుపరులు అనుకుం టున్నారు. ఈ విషయంలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో, చైనా (హెచ్ షేర్లు) మూడో స్థానంలో ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో హాంకాంగ్ (4), ఇండోనేసియా (5), చైనా (ఎ షేర్లు) (6), జపాన్ (7), ఫిలిప్పిన్స్ (8), సింగపూర్ (9), కొరియా (10) ఉన్నాయి.