బిజినెస్

లోతైన దర్యాప్తు చేస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ‘పనామా పేపర్స్’ వ్యవహారాన్ని లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, విదేశాల్లోని భారతీయుల ఖాతాల్లో ఏవైనా అక్రమాలున్నాయా? అన్న కోణంలో ఈ దర్యాప్తు జరుగుతోందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. అలాగే విజయ్ మాల్యా తరహా ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల కేసులను ఎదుర్కోడానికి న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను వినియోగిస్తున్నామని అన్నారు. 17 బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడి గత నెల 2న బ్రిటన్‌కు పారిపోయారన్న ఆరోపణలను మాల్యా మోస్తున్నది తెలిసిందే. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రమాదకర స్థాయికి మొండి బకాయిలు చేరిన నేపథ్యంలో విజయ్ మాల్యా వ్యవహారం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకోగా, 7,686 ఉద్దేశపూర్వక ఎగవేతదారుల వద్ద 66,190 కోట్ల రూపాయల బ్యాంకుల సోమ్ముంది. వీటికి సంబంధించి 1,669 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. కాగా, ‘పనామా పేపర్స్’పై ఇప్పటికే సిబిడిటి, ఫైనాన్షియల్ ఇంటిలిజెన్స్ యూనిట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో ఓ బహుళ విచారణ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అక్రమ సంపదతో పనామాలో విదేశీ కంపెనీలను ఏర్పాటు చేసినవారిలో 500 మంది భారతీయులున్నట్లు పనామా పత్రాలు వెల్లడించినది తెలిసిందే. వీరిలో సెలబ్రిటీలు, వ్యాపార, పారిశ్రామికవేత్తలూ ఉన్నారు.