బిజినెస్

మరోసారి ఇడికి ముఖం చాటేసిన మాల్యా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: మనీ లాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వరుసగా మూడోసారి కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఎదుట హాజరు కాలేదు. ఐడిబిఐ బ్యాంకుకు రూ. 900 కోట్లకు పైగా రుణాలను ఎగ్గొట్టిన మాల్యాపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదుచేసి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటికే రెండుసార్లు ఇడి ఎదుట హాజరవడంలో విఫలమైన మాల్యా తాజాగా శనివారం మరోసారి ముఖం చాటేశాడు. ఇడి ఎదుట హాజరయ్యేందుకు మే నెల వరకు గడువు ఇవ్వాలని కోరాడు. రుణాల చెల్లింపు వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్నందున ప్రస్తుతం తాను వ్యక్తిగతంగా ఇడి ఎదుట హాజరు కాలేకపోతున్నానని దర్యాప్తు అధికారికి మాల్యా తెలియజేశాడని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ కేసులో ఇడి దర్యాప్తు ముందుకు సాగేందుకు తన న్యాయవాదుల బృందం సహకరిస్తుందని మాల్యా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో తాను వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు గడువు ఇవ్వాలని మాల్యా గత వారం దర్యాప్తు అధికారికి చేసుకున్న విజ్ఞప్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తిరస్కరించిన విషయం విదితమే. ఈ క్రమంలో తాజాగా విచారణకు హాజరు కాకపోవడంతో పాటు మే నెల వరకు గడువు ఇవ్వాలని విజయ్ మాల్యా చేసిన విజ్ఞప్తిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేటర్ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నదీ ప్రస్తుతం అధికార వర్గాలు వెల్లడించలేదు.