బిజినెస్

యూరప్‌లో ఎయర్ ఇండియాసేవలవిస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వియెన్నా (ఆస్ట్రియా), ఏప్రిల్ 7: వచ్చే నాలుగేళ్లలో భారత్ ప్రపంచంలోని అతిపెద్ద విమానయాన మార్కెట్లలో మూడవదిగా ఆవిర్భవిస్తుందని అంచనాలు స్పష్టం చేస్తుండటంతో అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలని యోచిస్తున్న ఎయిరిండియా అందులో భాగంగా యూరప్‌లోని పలు కొత్త మార్గాల్లో తమ సేవలను ప్రారంభించేందుకు గల అవకాశాలను అనే్వషిస్తోంది. వచ్చే ఏడాది రెండు కొత్త మార్గాల్లో (బార్సిలోనా, మాడ్రిడ్) విమాన సేవలను ప్రారంభించేందుకు ప్రస్తుతం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుపుతున్న ఈ విమానయాన సంస్థ ఈ రెండు మార్గాలకు సేవలను విస్తరించడం ఆర్థికంగా సాధ్యమవుతుందని గుర్తించిందని ఎయిరిండియా వాణిజ్య విభాగం డైరెక్టర్ పంకజ్ శ్రీవాస్తవ వెల్లడించారు. న్యూఢిల్లీ నుంచి ఆస్ట్రియా రాజధానికి ఎయిరిండియా ప్రారంభించిన తొలి నాన్‌స్టాప్ విమానం వియెన్నాలో దిగిన అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ, ఈ కొత్త సర్వీసు ఫ్రీక్వెన్సీని పెంచే విషయాన్ని తమ సంస్థ పరిశీలిస్తుందన్నారు. భారత్‌కు యూరప్‌లో ఎనిమిదవ గమ్యస్థానంగా ఉన్న వియెన్నాకు ఎయిరిండియా ప్రస్తుతం వారానికి మూడు రోజులు చొప్పున డ్రీమ్‌లైనర్ బి 787-800 విమానాన్ని నడపనుంది.