బిజినెస్

‘సాగరమాల’తో పోర్టులు అనుసంధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మార్చి 26: ప్రధాన మంత్రి సాగరమాల పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని పోర్టులను అనుసంధానం చేస్తామని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇప్పటికే ఈ అంశంపై చర్చించి ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శనివారం విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీలో విద్యార్థులతో ముఖాముఖిలో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అనం తరం మంత్రి మాట్లాడుతూ ఉత్తర, దక్షిణ భారతంలో రవాణా ఎక్కువగా ఉంటుందని, రోడ్లపై రవా ణా ఖర్చు చాలా భారమవుతుందన్నారు. అం దుకోసమే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లోని 900 కిలోమీటర్లకు పైగా ఉన్న సముద్రతీర ప్రాంతంలో పోర్టులను ఏర్పాటు చేయాలని తలచినట్లు చెప్పారు. మేకిన్ ఇండియా కార్యక్రమం ద్వారా పరిశ్రమలు నెలకొల్పడానికి సులభతరమైందన్నారు. కాగా, సహారా, విజ య్ మాల్యా వంటి వారు చేసిన మోసాలను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇటువంటి పారిశ్రామికవేత్తల వల్ల దేశానికి కూడా చెడ్డపేరు వస్తుందన్నారు. మైక్రోఫైనాన్స్ ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడేవారని, వారి కోసమే ప్రధాన మంత్రి ముద్ర రుణాలను ప్రవేశపెట్టినట్టు చెప్పారు. విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్‌ఛైర్మన్ ఆర్ రవిచంద్రన్ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఈ సందర్భం గా ఘనంగా సత్కరించారు. విష్ణు మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు స్వయంగా గీసిన చిత్రపటాన్ని ఆమెకు బహూకరించారు. నరసాపురం ఎంపి డాక్టర్ గోకరాజు గం గరాజు, దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరా వు, రాజమండ్రి ఎమ్మెల్యే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం కార్యక్రమంలో మాట్లాడుతున్న నిర్మలా సీతారామన్