బిజినెస్

విమానయాన అభివృద్ధికి రాష్ట్రంలో పుష్కల అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 26: విమనయాన రంగాభివృద్ధికి రాష్ట్రంలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని విశాఖపట్నం ఎంపి కె హరిబాబు తెలిపారు. సరకు రవాణా, ప్యాసింజర్ విమానాలకు ఉన్న అవకాశాలను విమానయాన సంస్థలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఏపి ట్రావెలర్స్ అసోసియేషన్, ఏపి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్, టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫ్ ఏపి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ సమ్మిట్ శనివారం విశాఖలో నిర్వహించారు. నిజానికి ఈ సమ్మిట్‌ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి అశోక్ గజపతి రాజు ప్రారంభించాల్సి ఉండగా, ఆయన సోదరుడు ఆనంద్ గజపతి రాజు మృతి చెందడంతో సమావేశానికి వచ్చి వెంటనే వెళ్లిపోయారు. దీంతో సదస్సును ఎంపి హరిబాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని రకాల వనరులు ఉన్నాయని, ఓడరేవు, విమానాశ్రయం ఉన్న ప్రాంతాలు త్వరగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. కొలంబో, సింగపూర్ తదితర ప్రాంతాలే ఇందుకు నిదర్శమని పేర్కొన్నారు. అమరావతి రాజకీయ రాజధాని అయినా, ఆర్థిక, సాంస్కృతిక, పర్యాటక, పారిశ్రామిక రాజధాని మాత్రం విశాఖనే అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని గన్నవరం మినహా మిగిలిన విమానాశ్రయాలకు ఓడరేవులతో అనుసంధానం ఉందని, కాబట్టి విజయవాడ ప్రాంత అభివృద్ధికి మచిలీపట్నం ఓడరేవును అభివృద్ధి చేయాల్సి ఉందని గుర్తుచేశారు. అంతర్జాతీయ విమాన సర్వీసులకు సంబంధించి 5/20 విధానం, సీట్ షేరింగ్ విధానాలపై కొత్త ఏవియేషన్ విధానంలో దృష్టి సారించాల్సి ఉందని తెలిపారు. అయిదు సంవత్సరాల అనుభవం, 20 విమానాలు కలిగి ఉన్న సంస్థలే అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిపేందుకు ప్రస్తుత విధానంలో వీలుందని, అయతే దీనికి వ్యతిరేకంగా, అనుకూలంగా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. చార్టర్ పాలసీ, హెలీ టూరిజం వంటి అంశాలపై కూడా దృష్టి సారించాల్సి ఉందన్నారు. ఇన్‌ఫ్రా కార్పొరేషన్ ఎండి నరేష్‌కుమార్ మాట్లాడుతూ సహజ వనరులు పుష్కలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను.. తూర్పు దేశాలకు గేట్‌వేగా అభివర్ణించారు. 2020 నాటికి రాష్ట్రంలో 12 విమానాశ్రయాలు, 14 ఓడరేవులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. రాష్ట్రంలో తీరం వెంబడి 1,000 కిలోమీటర్ల మేర బీచ్ కారిడార్‌ను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఎయిర్‌పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఇండియా సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వివిజి రాజు మాట్లాడుతూ విజయవాడ విమానాశ్రయాన్ని విస్తరిస్తున్నామని, విశాఖలో మరో ఆరు విమానాలు పార్కింగ్ చేసేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నామని, భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని వసతులతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో విమానాశ్రయాల్లో సరకు, ప్యాసింజర్ రవాణా గణనీయంగా పెరిగిందన్నారు. ఈ సదస్సులో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ అధ్యక్షుడు గోయల్, ఎఎఐ మార్కెటింగ్ హెడ్ తారిఖ్ హుస్సేన్ భట్, ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెలర్స్ అసొసియేషన్ ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ డైరెక్టర్ నరేష్ కుమార్, ఉపాధ్యక్షుడు సాంబశివరావు, వివిధ విమానయాన సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొని ప్రసంగించారు.