బిజినెస్

వరుస లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 4: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. గత రెండు రోజుల లాభాలను కొనసాగిస్తూ మూడోరోజూ పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కీలక వడ్డీరేట్ల తగ్గింపు మధ్య మదుపరులు కొనుగోళ్లకు ఆసక్తి కనబరిచారు. బ్యాంకింగ్, రియల్టీ, ఆటో రంగాల షేర్లు ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 91.26 పాయింట్లు పుంజుకుని 28,334.55 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 31.05 పాయింట్లు పెరిగి 8,769.15 వద్ద నిలిచింది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, జపాన్ లాభపడగా, చైనా మార్కెట్‌కు సెలవు.
స్మార్ట్ఫోన్ ద్వారా ఓలా క్యాబ్ బుకింగ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 4: నిరంతరం మొబిలిటీ అవసరాలను తీర్చేందుకు అత్యంత ప్రాచుర్యం పొందిన రవాణా మొబైల్ యాప్ ఓలా సంస్థ ఓలా ఆఫ్ లైన్ సేవలను ప్రారంభించింది. వినియోగదారులు ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా తమ స్మార్ట్ఫోన్‌ల ద్వారా ఓలా యాప్‌పై క్యాబ్ బుక్ చేసుకోవచ్చునని ఆ సంస్థ సిటీవో కో ఫౌండర్ అంకిత్ భాతి తెలిపారు. ఓలా ఈ ఫీచర్‌ను పైలెట్ ప్రాజెక్టుగా చిన్న నగరాల్లో ఈ జూన్‌లో ప్రారంభించింది.
యప్ టీవీ బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్‌బాబు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 4: దక్షిణాసియా కంటెంట్‌ను కలిగిన ప్రపంచపు అతిపెద్ద ఆన్‌లైన్ స్ట్రీమింగ్ వేదిక యప్ టీవీ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్ బాబును ప్రకటించింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మహేష్ బాబు మాట్లాడుతూ ఎంటర్‌టైన్‌మెంట్ చానల్‌లో తన తొలి ప్రాధాన్యత యప్ టివి అని చెప్పారు. ప్రపంచం నలుమూలల నుంచి చూడాలనుకునేవారికి ఈ టీవీ చేరువైందన్నారు. యప్‌టివి సిఇఒ ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ తమ బ్రాండ్‌ను విస్తరించేందుకు మహేష్ బాబు ఉపయోగపడుతారని చెప్పారు.