బిజినెస్

జోరుగా ఆన్‌లైన్ అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: ఈ పండగ సీజన్‌లో ఆన్‌లైన్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ-కామర్స్ దిగ్గజాలు స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అందిస్తున్న ఆఫర్లు కొనుగోలుదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు తమ ఐదు రోజుల డిస్కౌంట్ సేల్స్‌కు విశేష స్పందన లభిస్తోందని ఆదివారం ప్రకటించాయి. ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ వినియోగదారులు కొనుగోళ్లకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపాయి. లక్షలాది లావాదేవీలు జరిగాయని పేర్కొన్నాయి. అమెజాన్ సైతం సాధారణ వ్యాపారానికి ఆరు రెట్లు అధికంగా ఈ ఐదు రోజుల స్పెషల్ సేల్‌లో స్పందనను చవిచూసినట్లు చెప్పింది. తొలిరోజు మొదటి 30 నిమిషాల్లోనే లక్ష ఉత్పత్తులను అమ్మేశామని, 12 గంటల్లో 15 లక్షల యూనిట్ల విక్రయాలు జరిగాయంది. స్నాప్‌డీల్ కూడా తొలి 16 గంటల్లో దేశవ్యాప్తంగా 2,800 నగరాలు, పట్టణాల్లో దాదాపు 11 లక్షల మంది కొనుగోలుదారులు ఉత్పత్తుల కోసం నమోదు చేసుకున్నట్లు వివరించింది. ఇక తొలిరోజు తొలి గంటలో 5 లక్షల ఉత్పత్తులను అమ్మినట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. 2015లో నిర్వహించిన బిగ్ బిలియన్ డేస్ తొలిరోజు నమోదైన అమ్మకాల కంటే ఈసారి తొలిరోజు తొలి ఆరు గంటల్లో జరిగిన అమ్మకాలు అధికమని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్స్ విభాగంలో యాపిల్ వాచీలకు విపరీతమైన డిమాండ్ కనిపించిందని, తొలి పది నిమిషాల్లో భారీ అమ్మకాలు జరిగాయంది. నెల రోజుల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అమ్మకాలతో పోల్చితే ఇది చాలా ఎక్కువని చెప్పింది. ఈ నెల 1 నుంచి ఈ ఐదు రోజుల డిస్కౌంట్, స్పెషల్ సేల్ కార్యక్రమానికి ఈ-కామర్స్ సంస్థలు శ్రీకారం చుట్టినది తెలిసిందే. అయతే తీవ్ర పోటీ మధ్య ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ చెల్లింపుల్లో అధికంగా ఇబ్బందులు ఎదురయ్యాయని పలువురు నెటిజన్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.