బిజినెస్

ఉత్తమ విమానాశ్రయంగా రేణిగుంటకు గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, సెప్టెంబర్ 27: రాష్ట్రంలోనే బెస్ట్ విమానాశ్రయంగా రేణిగుంట విమానాశ్రయానికి కేంద్రప్రభుత్వం గుర్తింపు ఇచ్చిందని తిరుపతి సబ్ కలెక్టర్ హిమాంశుశుక్ల తెలిపారు. మంగళవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం-2016ను పురస్కరించుకొని కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ కలినరీ ఇన్‌స్టిట్యూట్ తిరుపతి శాఖ ఆధ్వర్యంలో 2కె రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హిమాంశు శుక్ల స్థానిక రామానుజ సర్కిల్‌నుంచి శిల్పారామం వరకు ఈ 2కె రన్‌కు జెండా ఊపి ప్రారంభించారు. తిరుపతి టూరిజం సర్కిల్ అభివృద్ధి పేరిట సిఎం చంద్రబాబునాయుడు, జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. తిరుపతి విమానాశ్రయంలో చేపట్టిన సుందరీకరణ నేపథ్యంలో కేంద్రం అవార్డు ప్రకటించిందన్నారు. ఈ 2కె రన్‌లో పాల్గొని విజేతలైన యశ్వంత్‌యాదవ్, కార్తిక్, గోపి, వై.చౌరాబాయిలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వీరు పాక శాస్త్రాన్ని అభ్యసిస్తున్న విద్యార్థులని అధికారులు తెలిపారు.