బిజినెస్

700 మెగాహెట్జ్ బ్యాండ్‌ను ఇప్పుడే వేలం వేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: స్పెక్ట్రమ్‌లో 700 మెగాహెట్జ్ ప్రీమియం బ్యాండ్‌ను ఇప్పుడే వేలం వేయవద్దని ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్ వంటి ప్రముఖ సంస్థలు టెలికామ్ నియంత్రణా సంస్థ ‘ట్రాయ్’కి విజ్ఞప్తి చేశాయి. ఈ బ్యాండ్ ద్వారా సేవలు అందించేందుకు అవసరమైన పరికరాలు తగినంతగా అందుబాటులోకి వచ్చేవరకు ఈ వేలాన్ని నిలిపివేయాని ఆ సంస్థలు కోరాయి. మరోవైపు ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో సంస్థ ఇప్పటికీ దేశంలో నాలుగో తరం (4జి) మొబైల్ సేవలను ప్రారంభించని విషయం విదితమే. 700 మెగాహెట్జ్ ప్రీమియం బ్యాండ్‌లో రేడియో తరంగాలను వేలం వేయడానికి ముందు దేశంలో వాతావరణ పరిస్థితులను రెండేళ్లపాటు అంచనా వేయాల్సిన అవసరం ఉందని, కనుక ఈ బ్యాండ్‌ను ఇప్పట్లో వేలం వేయకపోవడమే మంచిదని రిలయన్స్ జియో సూచించింది.