బిజినెస్

ఎపి టూరిజం పాలసీ ఆకర్షణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 31: ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టూరిజం పాలసీ విజయవంతమైంది. ప్రభుత్వ అంచనాలకు మించి ఆదరణ లభిస్తోంది. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వరదలా తన్నుకొస్తున్నాయి. పర్యాటక రంగాన్ని భారీగా ప్రోత్సహించాలని భావించిన చంద్రబాబు సర్కారు.. వచ్చే ఐదేళ్లలో చేపట్టాల్సిన ప్రాజెక్టులతో కలిపి ఓ ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రణాళికలో భాగంగా రాష్ట్ర పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారిని పెద్ద ఎత్తున ఆహ్వానించింది. ఇందుకోసం అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించడానికి సిద్ధమైంది. 2020 నాటికి పర్యాటక రంగంలో 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని మొదట ప్రభుత్వం అంచనా వేసింది. దీంతోపాటు మన యువతకు లక్షల్లో ఉద్యోగావకాశాలు కూడా దక్కుతాయని భావించింది. కానీ ప్రభుత్వం అంచనాలను మించి టూరిజం పాలసీ ప్రకటించిన ఏడాదిలోగానే 13 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇప్పటికే 168 సంస్థలు పెట్టుబడులు పెట్టి ప్రాజెక్టులు ప్రారంభించడం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో 24 సంస్థలు ఇప్పటికే ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులూ తీసేసుకున్నాయి. సుమారు 5 వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రాజెక్టులు ప్రారంభించాయి. దాదాపు 3 వేల మందికి ఈ సంస్థలు ఉద్యోగావకాశాలు కల్పించాయి. మరో 135 సంస్థలకు చెందిన దరఖాస్తులు వివిధ దశల్లో ప్రభుత్వం అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ సంస్థలు 12,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి అనుమతులు కూడా పూర్తయితే.. దాదాపు 40 వేల మందికి ఈ ప్రాజెక్టుల్లో ఉద్యోగావకాశాలు దక్కుతాయి. 974 కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతం, అపూర్వమైన చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం, అద్భుతమైన ఆధ్యాత్మిక కట్టడాలు, చారిత్రక ఆనవాళ్లు.. వెరసి.. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ టూరిస్టుల్ని ఆకట్టుకోవడంలో ఏ పర్యాటక ప్రాంతానికి తీసిపోదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా విదేశీయులు పర్యటించాలనుకునే తొలి 12 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ను ఒకటిగా నిలబెట్టాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది చంద్రబాబు ప్రభుత్వం. స్వదేశీ టూరిస్టుల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌కు విశేషమైన ప్రాధాన్యత ఉంది. దేశవ్యాప్తంగా స్వదేశీ పర్యాటకుల్ని ఆకర్షిస్తున్న తొలి మూడు రాష్ట్రాల్లో ఎపిది మూడోస్థానం. మూడేళ్ల క్రితం అంచనాలను బట్టి రాష్ట్రానికి వచ్చిన స్వదేశీ పర్యాటకుల సంఖ్య 15 కోట్లకు పైమాటే. దేశీయంగా టూరిజం మార్కెట్‌లో ఇది 13.3 శాతం. ఈ మార్కెట్‌ను భారీగా పెంచుకోవడం ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచుకోవాలనుకుంటోంది ప్రభుత్వం. బీచ్-వాటర్ స్పోర్ట్స్, ఎకో టూరిజం, బుద్ధిస్ట్, రెలిజియస్, హెరిటేజ్, మైస్ (మీటింగ్స్, ఇన్‌సింటివ్స్, కాన్ఫరెనె్సస్ అండ్ ఎగ్జిబిషన్స్)-వౌలిక సదుపాయాల అభివృద్ధి, రిక్రియేషన్-అడ్వెంచర్, ఆధ్యాత్మికం, వైద్యం వంటి తొమ్మిది రంగాల్లో టూరిజంను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి-కాకినాడ, శ్రీశైలం-నాగార్జునసాగర్ ప్రాంతాలను ప్రధాన టూరిజం హబ్‌లుగా గుర్తించింది. 2020 నాటికి ఈ ఐదు ప్రాంతాలను అభివృద్ధి చేయడంతోపాటు, 2029 నాటికి అన్ని జిల్లా కేంద్రాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. ప్రధానమైన ప్రాజెక్టుల్ని ప్రైవేట్ రంగానికి కేటాయిస్తూ, అనుబంధ రంగాలను పబ్లిక్, ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ కింద అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టుల్ని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చేపట్టి, అభివృద్ధి చేయాలనుకుంటోంది. ప్రభుత్వ టూరిజం పాలసీ ప్రకారం... వచ్చే ఐదేళ్లలో హోటళ్లు, రిసార్టులు, అమ్యూజ్‌మెంట్ పార్కులు, మైస్ సెంటర్లు, గోల్ఫ్ కోర్సులు, బొటానికల్ గార్డెన్స్, టూరిజం, హాస్పిటాలిటీ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లు ఆధ్యాత్మిక కేంద్రాలు, మ్యూజియంలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే ప్రైవేటు వ్యక్తుల్లో వారి ఆర్థిక సామర్థ్యం మేరకు మూడు వర్గాలుగా విభజించి భారీ ఎత్తున రాయితీలు కూడా కల్పించబోతున్నారు.