బిజినెస్

సోనీ చేతికి టెన్ స్పోర్ట్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 31: మీడియా సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీ).. తమ స్పోర్ట్స్ చానెల్ టెన్ స్పోర్ట్స్‌ను సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్‌కు అమ్మేసింది. మొత్తం నగదు లావాదేవీల్లో జరిగే ఈ డీల్‌లో భాగంగా జీకి సోనీ పిక్చర్స్ దాదాపు 2,579 కోట్ల రూపాయల (385 మిలియన్ డాలర్లు)ను చెల్లించనుంది. ‘మా సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ‘స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ బిజినెస్’ను సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (ఎస్‌పిఎన్)కు అమ్మేందుకు, బదలాయించేందుకు అంగీకారం తెలిపారు. 385 మిలియన్ డాలర్లకు అమ్మేశాం’. అని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు జీ బుధ వారం తెలిపింది. తాజ్ టీవి లిమిటెడ్ మారిషస్ కింద తమ స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ బిజినెస్ నడుస్తోందని, టెన్ బ్రాండ్ ఆఫ్ టెలివిజన్ చానెల్స్, తాజ్ టెలివిజన్ (ఇండియా) ద్వారా ప్రసారాలు జరుగుతున్నాయని జీ వివరించింది. దుబాయ్‌కి చెందిన అబ్దుల్ రెహ్మాన్ భుక్తియార్ నేతృత్వంలోని తాజ్ గ్రూప్ నుంచి 2006లో టెన్ స్పోర్ట్స్‌ను జీ కొనుగోలు చేసింది. టెన్ బ్రాండ్‌లో టెన్ 1, టెన్ 1హెచ్‌డి, టెన్ 2, టెన్ 3, టెన్ గోల్ఫ్ హెచ్‌డి, టెన్ క్రికెట్, టెన్ స్పోర్ట్స్ చానెళ్లున్నాయి. భారత ఉప ఖండంతోపాటు మాల్దీవులు, సింగపూర్, హాంకాంగ్, మధ్య ప్రాచ్య, కరీబియన్ దేశాల్లో ఈ చానెళ్ల ప్రసారాలు జరుగుతున్నాయి. ఇక టెన్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ కొనుగోలుతో దేశ, విదేశీ స్థాయిలలో ఎస్‌పిఎన్ మరింత బలపడుతుందని, ముఖ్యంగా క్రికెట్, ఫుట్‌బాల్, ఫైట్ స్పోర్ట్స్ ప్రేమికులకు దగ్గరవుతుందని సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా సిఇఒ ఎన్‌పి సింగ్ అన్నారు. కాగా, గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో జీ ఏకీకృత ఆదాయంలో స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ బిజినెస్ వాటా 631 కోట్ల రూపాయలుగా నమోదైంది. అయినప్పటికీ 37.20 కోట్ల రూపాయల నికర నష్టాన్ని చవిచూసింది. మరోవైపు తాజా లావాదేవీతో జీ షేర్ల విలువ దాదాపు 2 శాతం పెరిగింది.

ఐఆర్‌సిటిసి
స్వదేశీ, విదేశీ యాత్రలు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఆగస్టు 31: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి).. స్వదేశీ, విదేశీ విమానయాన పర్యాటకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. హైదరాబాద్ నుంచి గోవా, హాంకాంగ్ యాత్రలను దసరా సందర్భంగా ప్రారంభించనుంది. ఈ మేరకు డిజిఎం ఎన్ సంజీవయ్య విశాఖలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. హాంకాంగ్, మకాల్, షెంజల్ యాత్రను అక్టోబర్ 8 నుంచి 12 వరకూ ఐదు రోజులపాటు నిర్వహిస్తారు. ఈ యాత్రకు 73,419 రూపాయలను వసూలు చేస్తారు. హాంకాంగ్‌లో రెండు రాత్రులు, మకావ్, షెంజన్‌లో ఒక్కో రాత్రి బస ఏర్పాటు చేస్తారు. హాంకాంగ్‌తోపాటు మకావ్, షెంజన్‌లో దర్శనీయ స్థలాలను చూపిస్తారు. అలాగే గోవా పర్యాటక యాత్రను నాలుగు రోజులపాటు నిర్వహిస్తారు. 18,970 రూపాయలను వసూలు చేస్తారు. మూడు రాత్రులు గోవాలో త్రీస్టార్ బస ఏర్పాటుతోపాటు అల్పాహారం, భోజన సదుపాయం కల్పిస్తారు. ఈ అవకాశాన్ని పర్యాటకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఎఫ్‌డిఐ విధానంలో మార్పులకు
కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ, ఆగస్టు 31: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) విధానంలో ఇటీవలి మార్పులను కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదించింది. రక్షణ రంగంలో ఎఫ్‌డిఐని 100 శాతానికి పెంచుతూ, ఇతర రంగాల్లోనూ పెట్టుబడుల రాకకు మార్గం సుగమం చేస్తూ నిర్ణయాలు తీసుకున్నది తెలిసిందే. దీంతో వీటికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇక్కడ సమావేశమైన కేంద్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు చతికిలపడిన నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగాలకు కొత్త ఊపు తెచ్చేందుకూ కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. వివాదాలు సత్వరమే పరిష్కారమయ్యేలా, స్తంభించిన ప్రాజెక్టుల పునరుద్ధరణ దిశగా చర్యలు చేపట్టింది.
మార్కెట్‌లోకి 15 హీరో మోటార్‌సైకిళ్లు
న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశీయ ఆటోరంగ దిగ్గజం, ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో 15 కొత్త ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌కు పరిచయం చేయాలనుకుంటోంది. ఈ మేరకు ఓ ప్రకటనలో సంస్థ చైర్మన్, ఎండి, సిఇఒ పవన్ ముంజల్ బుధవారం తెలిపారు. కొత్తగా పరిచయమయ్యే మోడళ్లలో సరికొత్త అచీవర్ 150 మోటార్‌సైకిల్, సూపర్ స్ప్లెండర్, పాషన్ ప్రో ఉన్నాయి.