బిజినెస్

8 నెలల్లో 4 వేల కోట్ల నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 30: డిజీల్ ఆధారిత వాహనాలపై నిషేధంతో గడచిన 8 నెలల్లో దేశీయ ఆటో పరిశ్రమకు 4,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో 2,000సిసి, అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన ఇంజిన్లున్న వాహనాల అమ్మకాలపై సుప్రీం కోర్టు నిషేధం విధించినది తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంతటి నష్టం వచ్చిందని భారతీయ ఆటోరంగ సమాజం సియామ్ అధ్యక్షుడు, అశోక్ లేలాండ్ ఎండి వినోద్ దాసరి మంగళవారం ఇక్కడ తెలిపారు. అయితే ఒక శాతం పర్యావరణ సెస్సుతో ఈ వాహనాల రిజిస్ట్రేషన్‌ను ఈ నెల ఆరంభంలో అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది. అయినప్పటికీ డీజిల్ వాహనాల విక్రయాలు మునుపటి స్థాయిలో లేవని ఇక్కడ జరిగిన ఆటోమోటివ్ కంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఎసిఎమ్‌ఎ) 58వ వార్షిక సదస్సులో పాల్గొన్న వినోద్ అన్నారు. మరోవైపు వినోద్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనంత్ గీతే స్పందించారు. ఆటో పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంటుందన్న ఆయన డీజిల్ వాహనాలపై నిషేధంపట్ల కోర్టులతో వైరం తగదని హితవు పలికారు. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో కాలుష్యానికి డీజిల్ వాహనాలే కారణమని సుప్రీం కోర్టు భావించి నిషేధం వేసిన నేపథ్యంలో సమయం దొరికినప్పుడల్లా కోర్టు నిర్ణయంపట్ల ఆటో రంగం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే అది మంచిది కాదని మంత్రి గీతే అన్నారు. ఇదిలావుంటే రాబోయే పదేళ్లలో ఆటోమొబైల్ పరిశ్రమ టర్నోవర్ నాలుగింతలు పెరిగి 20 లక్షల కోట్ల రూపాయలను తాకుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంచనా వేశారు. నాణ్యత విషయంలో వెనక్కి తగ్గకూడదంటూ ఎసిఎమ్‌ఎ సదస్సులో పాల్గొన్న ఆయన ఆటోరంగ సంస్థలను కోరారు. సుప్రీం నిర్ణయంతో డీజిల్ వాహన విక్రయాలు సందిగ్ధంలో పడిన క్రమంలో గడ్కరీ.. ఆటో పరిశ్రమకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఇక 10-15 సంవత్సరాలు పైబడిన వాహనాలను స్క్రాప్ చేసే విధానంతో ఆటో పరిశ్రమ 22 శాతం వృద్ధి చెందుతుందన్నారు. ఈ విధానంతో 14,000 కోట్ల రూపాయల ప్రయోజనం ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం 4 వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు 10 వేల కోట్ల మేర ప్రయోజనం అందుకుంటాయన్నారు. అంతేగాక పాత వాహనాలను త్యజించడం ద్వారా కాలుష్యం కూడా బాగా తగ్గుతుందని పేర్కొన్నారు.