బిజినెస్

- ఆర్‌బిఎల్ బ్యాంక్ ఐపిఒ - తొలిరోజు 66 శాతం సబ్‌స్క్రైబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 19: ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ ఆర్‌బిఎల్ బ్యాంక్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) తొలిరోజు 66 శాతం బిడ్లను అందుకుంది. దశాబ్దకాలంలో ఓ ప్రైవేట్‌రంగ బ్యాంకు ఐపిఒకు రావడం ఇదే తొలిసారి అవగా, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో చివరిసారిగా 2005లో యెస్ బ్యాంక్ ఐపిఒ వచ్చింది.
ప్రభ్వురంగ బ్యాంకుల్లోనైతే ఆరేళ్ల క్రితం 2010లో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ చివరిసారిగా పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ఇక శుక్రవారం మొదలైన ఈ పబ్లిక్ ఇష్యూ.. ఈ నెల 23 వరకు ఉంటుంది. ఈ ఇష్యూ విజయవంతమైతే 832.50 కోట్ల రూపాయల నిధులు ఆర్‌బిఎల్ చేతికి వస్తాయి. ఇప్పటికే గురువారం యాంకర్ ఇనె్వస్టర్లకు ఒక్కో షేర్‌ను 225 రూపాయల చొప్పున 1.61 కోట్లకుపైగా షేర్లను విక్రయించి 364 కోట్ల రూపాయలను బ్యాంక్ అందుకుంది. ఎఫ్‌ఐఎల్ ఇనె్వస్ట్‌మెంట్స్ మారిషస్ లిమిటెడ్, గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ గ్లోబల్, గోల్డ్‌మాన్ సాచ్స్ ఇండియా ఫండ్ లిమిటెడ్, ఔబర్న్ లిమిటెడ్, హెచ్‌ఎస్‌బిసి గ్లోబల్ ఇనె్వస్ట్‌మెంట్ ఫండ్స్--ఇండియన్ ఈక్విటీ తదితర సంస్థలు ఈ షేర్లను కొన్నాయి.
కాగా, ఐపిఒలో భాగంగా మార్కెట్‌లో 3.79 కోట్ల షేర్లను ఆర్‌బిఎల్ అమ్మకానికి పెట్టగా, శుక్రవారమే 2.51 కోట్ల షేర్లకు సరిపడా బిడ్లు దాఖలయ్యాయి.