బిజినెస్

ఖనిజాధార పరిశ్రమలను ప్రోత్సహిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 23: దేశంలో ఖనిజ ఆధారిత పరిశ్రమల స్థాపనకు రెండవ అనుకూల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ బ్యాంకు గుర్తింపు లభించిందని భూగర్భ, ఖనిజ వనరుల శాఖ కార్యదర్శి యం.గిరిజా శంకర్ పేర్కొన్నారు. 2016 జనవరి, 10 నుండి 12 వరకు విశాఖపట్నంలో పారిశ్రామిక శిఖరాగ్ర ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక ప్రైవేట్ సమావేశ మందిరంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో బుధవారం దేశీయ ఖనిజ ఆధారిత పరిశ్రమల అనుసంధాన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజా శంకర్ మాట్లాడుతూ, ఖనిజాధారిత పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం ద్వారా సులభంగా అనుమతులు ఇచ్చి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నా మన్నారు. దేశంలో 2022 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానంలో అభివృద్ధి పథంలో నిలిచేందుకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉత్తమమైన పద్ధతులను అమలు చేస్తున్నామన్నారు. ఖనిజ పరిశ్రమల రంగంతో పాటు, ఆహార ప్రక్రియ యూనిట్ల స్థాపన ద్వారా అత్యధిక స్థాయి ఉత్పత్తులను సాధించడం ద్వారా దేశీయంగానే కాక, ప్రపంచ స్థాయికి చేరుకోవడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలలో ఆయా ప్రాంతాలలోని ఖనిజాల ఆధారంగా బాక్సైట్, లైమ్‌స్టోన్, బైరెటీస్, రోడ్ మెటల్, మాంగనీసు తదితర ఖనిజాలు అందుబాటులో ఉన్నాయని, రాబోయే రోజులలో ఆయా ఖనిజాలను సమగ్రంగా వినియోగంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. రాష్ట్ర ఆదాయంతో పాటు ఆయా ప్రాంతాల సామాజిక అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టిసారిస్తూ వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత నివ్వడం జరుగుతోందన్నారు. ఈ విషయంలో అన్ని విధాలైన ముందస్తు అధ్యయనం చేసిన తదుపరే ఆయా ప్రాంతాలలో సంబంధిత ఖనిజాల ఆధారిత పరిశ్రమల స్థాపనకు అడుగులు వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఖనిజాలను ప్రభుత్వం గుర్తించడం జరిగిందన్నారు. ఆవశ్యకత కలిగిన, అందుబాటులో వున్న 8 ఖనిజ ఆధారిత పరిశ్రమల స్థాపన ద్వారా ఉత్తమమైన ఖనిజాల ఉత్పత్తిని సాధించేందుకు చర్యలు చేపడుతున్నామని, అవి సిమెంట్, గ్యాస్, గ్రెనేట్ కటింగ్ అండ్ పాలిషింగ్, టైటాన్ ఆధారిత ఖనిజాలు, సిరమిక్స్, ఫెర్రో ఎల్లారుూస్ నిర్మాణాలకు వినియోగించే ఇసుక, కెమికల్స్ అని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు ప్రభుత్వం నూతన మార్గదర్శాల ద్వారా అనుమతులను ఇస్తుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆయా పరిశ్రమల ద్వారా జరిగే ఉత్పత్తిలో 50 శాతం మేర ప్రభుత్వం కొనుగోలుకు ముందుకు వస్తుందన్నారు. విశాఖపట్నంలో 2016, జనవరి 10 నుండి 12 వరకు నిర్వహించే సమావేశంలో ఆసక్తి ఉన్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో అవగాహనా తాఖీదు (ఎమ్‌ఓయు) ముఖ్యమంత్రి సమక్షంలో ఒక అంగీకారానికి రావడం, ఇందుకోసం నూతనంగా రూపొందించిన సరళీకృత నూతన ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి విధానాలను అమలు చేసుకోవడం జరుగుతుందన్నారు.
ఎపియండిసి, మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్‌వి చౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉత్తమమైన పద్ధతులను అమలు చేయడం ద్వారా దేశ స్థాయిలో అవార్డులను దక్కించుకున్నామని వివరించారు. సిఎస్‌ఆర్ విధానాలను పకడ్బందీగా అమలు చేస్తోందని వివరించారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి, క్రీడా ఉత్సవాలు, పారిశ్రామిక సామరస్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని చౌదరి వెల్లడించారు. 2020 నాటికి ఖనిజ ఆధారిత రంగంలో రాష్ట్ర ఆదాయం రూ.3,500 కోట్లకు చేరుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. పరిశ్రమల స్థాపనలో భాగంగా ప్రభుత్వంతో కుదుర్చుకునే దీర్ఘకాలిక ఒప్పందాల సమయంలో ఇప్పుడు అందించే అనుమతులపై హామీలను కొనసాగించేలాగా సహకారం అందివ్వాలని పలువురు పారిశ్రామిక వేత్తలు ప్రతిపాదనలు చేశారు.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ భూగర్భ, ఖనిజాల శాఖకు చెందిన అధికారులు అన్సాని, రాష్ట్ర, రాష్ట్రేతర ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు కెపి రెడ్డి, స్వామిదాసు, రవిచంద్ర, శ్రీనివాసరాజు, చక్రవర్తి, మల్లిఖార్జున్, జివిఎస్‌కె రెడ్డి, అరుణ సుబ్బయ్య, విజయ ఆనంద్, గోపాలకృష్ణ, సివిఆర్ మూర్తి, యస్‌ఎం పాణిగ్రహి, ప్రొ.సురేంద్ర కుమార్ జన్‌లతో పాటు సిరమిక్, గ్లాస్, గ్రెనేట్, సిమెంట్, తదితర ఆధారిత పరిశ్రమలకు చెందిన ప్రతినిథులు హాజరయ్యారు.