బిజినెస్

అమ్మకాల ఒత్తిడిలో మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 26: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 118.82 పాయింట్లు కోల్పోయి 27,976.52 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 45 పాయింట్లు దిగజారి 8,590.65 వద్ద నిలిచింది. అమెరికా, జపాన్ సెంట్రల్ బ్యాంక్‌ల సమావేశాల క్రమంలో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. ఇక దేశీయ ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకి ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను ప్రకటించిన ఆర్థిక ఫలితాలు బాగున్నప్పటికీ మదుపరులు ఆ సంస్థ షేర్లను అమ్మేశారు. దీంతో ఆ సంస్థ షేర్ విలువ సోమవారం ముగింపుతో పోల్చితే 1.44 శాతం పడిపోయి 4,485.25 రూపాయల వద్ద ముగిసింది.అలాగే ఔషధరంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో ఆ సంస్థ షేర్ విలువ 4.37 శాతం క్షీణించింది. షేర్ విలువ 3,322.85 రూపాయల వద్ద నిలిచింది. రియల్టీ, ఆటో, హెల్త్‌కేర్, బ్యాంకింగ్, చమురు, గ్యాస్, ఇండస్ట్రియల్స్, ఎనర్జీ రంగాల షేర్ల విలువ 1.32 శాతం నుంచి 0.42 శాతం మేర పడిపోయింది. ఐటి, టెక్నాలజీ, యుటిలిటీస్ షేర్ల విలువ 0.38 శాతం నుంచి 0.13 శాతం పెరిగింది. ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు లాభాలను అందుకున్నాయి. ఐరోపా మార్కెట్లలో బ్రిటన్ లాభాల్లో ముగిస్తే, జర్మనీ, ఫ్రాన్స్ సూచీలు నష్టపోయాయి.
రెగ్జిట్ తర్వాత సెనె్సక్స్ పైకి!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్‌గా రెండోసారి కొనసాగలేనంటూ రఘురామ్ రాజన్ ప్రకటించిన నాటి నుంచి బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ దాదాపు 3.5 శాతం పెరగడం గమనార్హం. జూన్ 20 నుంచి జూలై 22 వరకు సెనె్సక్స్ సుమారు 1,000 పాయింట్లు ఎగబాకింది. జూన్ 20న 26,867 పాయింట్లతో ఉన్న సెనె్సక్స్.. జూలై 22 నాటికి 27,803 పాయింట్లకు చేరింది. నిజానికి ఆర్‌బిఐ నుంచి రాజన్ నిష్క్రమణ (రెగ్జిట్) ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూలంగానే ఉంటుందని తొలుత అంచనాలు వినిపించాయి. అయితే ప్రభుత్వం తీసుకున్న సంస్కరణాత్మక నిర్ణయాలు, వర్షాలు సమృద్ధిగా కురవడం వంటివి మార్కెట్ ట్రేండ్‌ను బలపరిచాయి.
స్పందన అంతంతమాత్రమే
సాధారణ ట్రేడింగ్ అనంతరం సోమవారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు గంటల పాటు నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో నిర్వహించిన ప్రభుత్వ బాండ్ల ఆన్‌లైన్ వేలానికి విదేశీ మదుపరుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే వ్యక్తమైంది. 7,264 కోట్ల రూపాయల విలువైన బాండ్లను వేలం వేస్తే 7,227 కోట్ల రూపాయల విలువైన బిడ్లు మాత్రమే దాఖలయ్యాయి. దీంతో 37 కోట్ల రూపాయల విలువైన బాండ్లు మిగిలిపోయాయి. ఇంతకుముందు వేసిన వేలాల్లో మదుపరుల నుంచి విపరీతమైన స్పందన కనిపించినది తెలిసిందే. కానీ ఈసారి మాత్రం ఆ స్థాయిలో ఆదరణ కరువైంది.
పసిడి బాండ్ల పథకం ద్వారా..
మరోవైపు నాలుగో విడత సార్వభౌమ పసిడి బాండ్ల పథకంలో భాగంగా గత వారం 5 రోజులపాటు నిర్వహించిన ప్రత్యేక విండో ద్వారా 106.5 కోట్ల రూపాయల విలువైన 341.6 కిలోలకు సబ్‌స్క్రిప్షన్ బిడ్లు అందుకున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) తెలిపింది.
జూలై 18 నుంచి 22 వరకు బిడ్లను స్వీకరించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) బాండ్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా, స్టాక్ మార్కెట్లు వాటిని స్వీకరించాయ.