బిజినెస్

మారుతి లాభం రూ. 1,486 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 26: దేశీయ ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకి ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 1,486.2 కోట్ల రూపాయల నికర లాభాన్ని అందుకుంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) తొలి త్రైమాసికంలో 1,208.1 కోట్ల రూపాయల నికర లాభాన్ని అందుకోగా, ఈసారి 23 శాతం లాభం పెరిగినట్లైంది. నికర అమ్మకాలు ఈసారి 14,654.5 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 13,078.3 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఈ మేరకు మంగళవారం మారుతి సుజుకి ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. అధిక టర్నోవర్, తగ్గిన ఉత్పాదక వ్యయం, పెరిగిన నిర్వహణేతర ఆదాయం వంటివి కలిసొచ్చాయని సదరు ప్రకటనలో మారుతి తెలిపింది. ఇక ఈ ఏప్రిల్-జూన్‌లో మొత్తం 3,48,443 వాహనాలను విక్రయించామని, గతంతో పోల్చితే ఇది 2.1 శాతం ఎక్కువని సంస్థ ఈ సందర్భంగా పేర్కొంది. ఈసారి అమ్మకాల్లో దేశీయ మార్కెట్‌లో జరిగినవి 3,22,340 యూనిట్లుగా ఉండగా, విదేశాలకు జరిగిన ఎగుమతులు 26,103 యూనిట్లుగా ఉన్నాయి. కాగా, ఏప్రిల్, మే నెలల్లో అమ్మకాల వృద్ధిరేటు 10.2 శాతంగా ఉందని, అయితే సంస్థకు చెందిన ఓ ప్రధాన డీలర్‌షిప్‌లో దురదృష్టవశాత్తు సంభవించిన అగ్నిప్రమాదం జూన్ అమ్మకాలను దెబ్బతీసిందని మారుతి వెల్లడించింది. అయినప్పటికీ మున్ముందు అమ్మకాలు పెరిగి ఈ లోటు భర్తీ కాగలదన్న విశ్వాసాన్ని సంస్థ వెలిబుచ్చింది.