బిజినెస్

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో చేతికి ఎల్‌అండ్‌టి జనరల్ ఇన్సూరెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 3: హౌజింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సికి చెందిన జీవిత బీమాయేతర సంస్థ హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో.. ఎల్‌అండ్‌టి జనరల్ ఇన్సూరెన్స్‌ను సొంతం చేసుకుంటోంది. మొత్తం నగదు లావాదేవీల్లో జరిగే ఈ కొనుగోలులో 551 కోట్ల రూపాయలకు ఎల్‌అండ్‌టి జనరల్ ఇన్సూరెన్స్.. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హస్తగతమవనుంది. ‘బీమా వ్యాపారంలో ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఈ రంగంలో ఏకీకరణలు అనివార్యం. ఈ లావాదేవీ ఇందుకు ఆరంభం.’ అని హెచ్‌డిఎఫ్‌సి చైర్మన్ దీపక్ పరేఖ్ ఓ ప్రకటనలో తెలిపారు. సంస్థ బోర్డు ఈ కొనుగోలుకు అంగీకరించిందని కూడా చెప్పారు. అంతేగాక హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో ఎల్‌అండ్‌టి జనరల్ ఇన్సూరెన్స్ కలయిక.. పాలసీ హోల్డర్లకు, ఇతర భాగస్వాములకు లాభిస్తుందని అన్నారు. ఎల్‌అండ్‌టి జనరల్ కొనుగోలు మార్కెట్‌లో హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో స్థానాన్నీ పెంచుతుందన్న ధీమాను వెలిబుచ్చారు. కాగా, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోకు 108 కార్యాలయాలుండగా, స్థూలంగా 3,467 కోట్ల రూపాయల ప్రీమియంను కలిగి ఉంది. ఇది 151 కోట్ల రూపాయల లాభాన్ని ఇటీవల ప్రకటించింది. హెచ్‌డిఎఫ్‌సి, ఎర్గో ఇంటర్నేషనల్ సంస్థలు 51:49 శాతం నిష్పత్తితో హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోను ఏర్పాటు చేశాయి. దేశీయంగా ఇప్పుడిది ప్రైవేట్‌రంగ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల్లో నాలుగో అతిపెద్ద సంస్థ. ఇకపోతే ఇంజినీరింగ్ దిగ్గజం లార్సెన్ అండ్ టర్బో అనుబంధ సంస్థ అయిన ఎల్‌అండ్‌టి జనరల్ ఇన్సూరెన్స్.. నిరుడుతో పోల్చితే 40 శాతం వృద్ధిని నమోదు చేస్తూ స్థూలంగా 483 కోట్ల రూపాయల ప్రీమియంను వసూలు చేసింది. 800 మంది ఉద్యోగులున్న ఈ సంస్థకు 28 కార్యాలయాలున్నాయి.