బిజినెస్

తెలంగాణలో జోరుగా వాణిజ్య పన్ను చెల్లింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 3: తెలంగాణ రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరాని (2015-16)కి సంబంధించి అత్యధికంగా వాణిజ్య పన్ను చెల్లించిన సంస్థల జాబితాను వాణిజ్య పన్నుల శాఖ శుక్రవారం విడుదల చేసింది. అత్యధిక పన్ను చెల్లించిన జాబితాలో తయారీ రంగం నుంచి ఐటిసి లిమిటెడ్, హిందుస్తాన్ యునిలివర్ లిమిటెడ్, హిందుస్తాన్ కోకకోలా బేవరెజస్, ఏషియన్ పేయంట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ ఉన్నాయి. రిటైల్ విభాగంలో సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, వరుణ్ మోటర్స్, ఎల్‌జి ఎలక్ట్రానిక్స్, అశోక్ లీలాండ్. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉన్నాయి. నిర్మాణ రంగం నుంచి మేగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్టక్చర్ లిమిటెడ్, ఎల్‌అండ్‌టి ఉన్నాయి. వృత్తి పన్ను చెల్లింపు విభాగం నుంచి ఇండియా ఇన్ఫో వెల్త్ మేనేజిమెంట్ లిమిటెడ్, అసెంచర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ, పృథ్వీ ఆదిత్య ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఉన్నాయి. వినోద పన్ను చెల్లింపుల విభాగంలో ఉషా కిరణ్ మూవీస్, వైజయంతి సినిమా, సన్‌రైజర్స్ హైదరాబాద్ సన్ టివీ నెట్‌వర్క్ లిమిటెడ్, హాత్‌వే కేబుల్ అండ్ డాటాకమ్ లిమిటెడ్, ప్రసాద్ ఐమాక్స్ ఉన్నాయి. కాగా, పన్నులు సకాలంలో చెల్లించడం ద్వారా బంగారు తెలంగాణలో ఇతర సంస్థలూ భాగస్వామ్యం కావాలని ఈ సం దర్భంగా వాణిజ్య పన్నుల శాఖ పిలుపునిచ్చింది.