బిజినెస్

ప్రపంచ వృద్ధి చోదకశక్తి భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, మే 30: ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనంపై సర్వత్రా ఆందోళనల మధ్య వచ్చే పదేళ్లకుగాను ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ చోదకశక్తిగా వ్యవహరించనుందని సింగపూర్ మాజీ ప్రధాని గో చోక్ టంగ్ అన్నారు. ‘ప్రపంచ దేశాల ఆశలన్నీ భారత్‌పైనే. పదేళ్ల క్రితం చైనా మాదిరిగానే ఇప్పుడు భారత్ కనిపిస్తోంది. చైనా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం మందగమనంలో ఉన్న నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చోదకశక్తి ఇక భారతే.’ అని జపాన్ స్టాక్ మార్కెట్ నికీ నిర్వహించిన ఆసియా భవిష్యత్ సదస్సులో పాల్గొన్న టంగ్ అభిప్రాయపడ్డారు. అయితే ఆరు రోజుల పర్యటనలో భాగంగా జపాన్‌లో పర్యటిస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సైతం ఈ సదస్సుకు హాజరవగా, ఇక్కడ ఆయన ఏమీ మాట్లాడలేదు. అయితే మంగళవారం జరిగే సదస్సులో జైట్లీ ప్రసంగించనున్నారు. కాగా, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) ఈ ఏడాదికిగాను ప్రపంచ వృద్ధిరేటు అంచనాను గడచిన ఏడాది కాలంలో నాలుగుసార్లు సవరించి 3.2 శాతానికి చేర్చింది. చైనా ఆర్థిక మందగమనం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పతనం, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వృద్ధి ఆశాజనకంగా లేకపోవడమే దీనికి కారణం. అయితే భారత్ జిడిపి వృద్ధి అంచనాను మాత్రం 7.3 శాతం నుంచి 7.5 శాతానికి ఐఎమ్‌ఎఫ్ పెంచింది. ఈ క్రమంలో భారత జిడిపి వృద్ధిపై ఇతర దేశాలూ ఎంతో ఆశాజనకంగా ఉన్నాయి.