బిజినెస్

కొత్తగా 2 కోట్ల కొలువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 25: క్యాపిటల్ గూడ్స్ పాలసీని బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదించింది. తద్వారా 2025 నాటికి 21 మిలియన్లకుపైగా కొత్త ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ జాతీయ పాలసీ అందుకు దోహదపడుతుందని పరిశ్రమ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయ. ఈ పాలసీతో క్యాపిటల్ గూడ్స్ రంగంలో ప్రస్తుతమున్న ఉత్పత్తి సామర్థ్యం 2.3 లక్షల కోట్ల రూపాయల నుంచి 7.5 లక్షల కోట్ల రూపాయలకు పెరగనుంది. ఇక 70,000 కోట్ల రూపాయల విలువైన హైడ్రోకార్బన్ నిల్వలున్న 46 చిన్నపాటి చమురు, గ్యాస్ నిక్షేపాలను జూలై నుంచి వేలం వేయడానికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం అనుమతిచ్చింది. ఈ వేలం కోసం దేశ, విదేశాల్లో జూన్ 6 నుంచి రోడ్ షోలు నిర్వహించనుండగా, జూలై 15 నుంచి అక్టోబర్ 31 వరకు జరిగే వేలంలో బిడ్లను స్వీకరిస్తారు. నవంబర్‌లో ఈ బిడ్లను ఎంపిక చేసి, జనవరిలో ఒప్పందాలను కుదుర్చుకుంటామని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. కాగా, ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్ ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఎఫ్‌సిఎల్)కు చెందిన 9,079 కోట్ల రూపాయల రుణాలను కేబినెట్ మాఫీ చేసింది. ఆర్థిక పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. అలాగే మరో ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్ స్టీల్ వర్క్స్ కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్ (హెచ్‌ఎస్‌సిఎల్) ఆర్థిక పునర్‌వ్యవస్థీకరణనూ కేబినెట్ ఆమోదించింది. నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌బిసిసి) ద్వారా హెచ్‌ఎస్‌సిఎల్ టేకోవర్‌కూ అనుమతించింది. ఇకపోతే తపాలా శాఖ సేవల కేడర్ రివ్యూకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తపాలా శాఖ విధులు, దాని బలోపేతానికి ఇది దోహదపడగలదని ప్రభుత్వం అభిప్రాయపడింది. మరోవైపు థర్మల్ పవర్‌పై భారత్, జపాన్ ఒప్పందాన్ని కూడా కేబినెట్ అమోదించింది. కర్బన ఉద్గారాలను తక్కువగా విడుదల చేస్తూ జరిగే బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని వేగిరం చేయడానికి ఈ ఒప్పందం కృషి చేయనుంది. ఇదిలావుంటే విదేశీ పెట్టుబడుల పరిమితిని పెంచుకోవడానికి యెస్ బ్యాంక్‌కు ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతమున్న 41.87 శాతం నుంచి 74 శాతానికి విదేశీ పెట్టుబడుల పరిమితిని పెంచుకునేలా యెస్ బ్యాంక్‌కు అనుమతిచ్చినట్లు కేబినెట్ సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. ఈ నిర్ణయంతో దేశంలోకి 6,885 కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) రావచ్చన్నారు.

విశాఖ ఎడిసి కార్యాలయం విజయవాడకు

విశాఖపట్నం, మే 25: విశాఖలోని వాణిజ్య పన్నుల శాఖ అప్పిలేట్ డిప్యూటి కమిషనర్ (ఎడిసి) కార్యాలయం విజయవాడకు తరలిపోనుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు ఎడిసి కార్యాలయాలు ఉన్నాయి. వాటిని రెండుగా కుదిస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో విశాఖలోని ఎడిసి కార్యాలయాన్ని విజయవాడకు తరలిస్తూ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 31లోగా పూర్తి స్థాయిలో కార్యాలయాన్ని తరలించాలని ఆదేశించారు. జూన్ 1 నుంచి ఎడిసి కార్యాలయ కార్యకలాపాలు విజయవాడ నుంచే కొనసాగించాలని సూచించారు. దీంతో చిన్నచిన్న పనులకు కూడా సిటిఒ స్థాయి అధికారులు విజయవాడ వెళ్లాల్సి ఉంటుంది. శ్రీకాకుళం, ఇచ్ఛాపురం వంటి ప్రాంతాలకు చెందిన ఆఫీసర్లు కూడా దాదాపు విజయవాడకు తమ పనుల నిమిత్తం వెళ్లాల్సి ఉంటుందని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. విజయవాడలో కార్యాలయం అద్దె భవనంలో ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, తగిన వసతులు లేకుండా తరలించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖ వంటి ముఖ్యమైన నగరంలో ఎడిసి కార్యాలయం కొనసాగించకుండా తరలించడంపై ప్రభుత్వం పునరాలోలించాలని కోరుతున్నారు.