బిజినెస్

శ్రీసిటీలో జపాన్ పారిశ్రామికవేత్తల బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యవేడు, మే 25: డైరెక్టర్ జనరల్ ఆఫ్ జపాన్ మినిస్టర్ ఆఫ్ ఎకానమీ, ట్రేడ్ ఇండస్ట్రీ సిజె టక్కాగీ సారథ్యంలో 50 మంది పారిశ్రామిక వేత్తల బృందం బుధవారం చిత్తూరు జిల్లా శ్రీసిటీ సెజ్‌ను సందర్శించింది. ఈ బృందానికి శ్రీసిటీ అధ్యక్షుడు రమేష్ సుబ్రహ్మణ్యం సాదర స్వాగతం పలికారు. అనంతరం బిజినెస్ సెంటర్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో శ్రీసిటీ వౌలిక వసతులు, అనుకూలతలు, ప్రగతి గురించి రమేష్ సుబ్రహ్మణ్యం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. శ్రీసిటీలో 26 దేశాలకు చెందిన 120 పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, అందులో జపాన్ దేశ పరిశ్రమలే అధికంగా ఉన్నాయని గుర్తుచేశారు. జపాన్ పారిశ్రామిక ఏర్పాట్ల కోసం ప్రత్యేక ఎన్‌క్లేవ్ ట్రాన్స్‌లేటర్, ఫుడ్‌కోర్టు, స్పోర్ట్ కోర్టు, ఇతర వసతులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇంకా శ్రీసిటీకి ఉన్న ప్రత్యేక అనుకూలతలు, రోడ్లు, రవాణా, పోర్టు సౌకర్యాల గురించి వివరించారు. పలువురు ప్రతనిధులు లేవనెత్తిన పలు సందేహాలను ఆయన నివృత్తి చేశారు. అనంతరం సిజి టక్కాగీ మాట్లాడుతూ శ్రీసిటీ వౌలిక వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. జట్రో చీఫ్ డైరెక్టర్ జనరల్ క్రొషికా తక్కటోరి మాట్లాడుతూ శ్రీసిటీ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గత రెండురోజులుగా రాష్ట్రంలో పారిశ్రామిక వాడల పర్యటన, వ్యాపార ఆవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో జపాన్‌కు చెందిన పలు ప్రముఖ పరిశ్రమల సిఇఓలు, ఇతర సీనియర్ ప్రతినిధు లు, శ్రీసిటీ సెజ్ డెవలెప్‌మెంట్ కమిషనర్ అనిల్ కె చౌదరి, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జాయింట్ చీఫ్ ఎన్విరానె్మంటల్ ఇంజనీర్ రాజేంద్ర రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రామలింగరాజు, ఎపి ఐఐసి జోనల్ మేనేజర్ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శ్రీసిటీలో బుధవారం పర్యటించిన జపాన్ ప్రతినిధుల బృందం