బిజినెస్

మార్కెట్లకు ‘మారిషస్’ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 11: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. గత రెండు రోజులుగా లాభాలను అందుకున్న సూచీలపై మంగళవారం మారిషస్‌తో ద్వంద్వ పన్నుల నిరోధక ఒప్పందం సవరణ ప్రభావం పడింది. వచ్చే ఏడాది నుంచి భారత్‌కు మారిషస్ ద్వారా వచ్చే పెట్టుబడులపై పన్ను వేస్తామన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బ తీసింది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 175.51 పాయింట్లు కోల్పోయి 25,597.02 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 38.95 పాయింట్లు పడిపోయి 7,848.85 వద్ద నిలిచింది. నిజానికి ఉదయం ఆరంభంలో సెనె్సక్స్ 337 పాయింట్లు, నిఫ్టీ 107 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. అయితే మళ్లీ తేరుకోగలిగాయి. అయినప్పటికీ టెలికామ్, రియల్టీ, పవర్, ఐటి, టెక్నాలజీ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావడంతో నష్టాలు తప్పలేదు. ఈ రంగాల షేర్ల విలువ 2.34 శాతం నుంచి 0.65 శాతం మేర దిగజారింది. ఇక అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో జపాన్, చైనా సూచీలు లాభపడగా, హాంకాంగ్ సూచీ నష్టపోయింది. ఐరోపా మార్కెట్లలోనూ ప్రధాన సూచీలైన ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు క్షీణించాయి.