బిజినెస్

దీర్ఘకాలిక సంస్కరణలు శూన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 8: నిలకడయిన ఆర్థికాభివృద్ధికి దోహదపడే దీర్ఘకాలిక ఆలోచనలు ప్రారంభించడానికి మోదీ ప్రభుత్వానికి సమయం మించి పోతోందని ప్రముఖ ఆర్థికవేత్త ఇలా పట్నాయక్ హెచ్చరిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న మూల సమస్యలను పరిష్కరించే గణనీయమైన సంస్కరణల కార్యక్రమమేదీ ఇప్పటివరకు కనిపించడం లేదని అన్నారు. ఇప్పుడు కొన్ని ప్రయత్నాలయితే జరుగుతున్నాయి.. అయితే చివరి రెండేళ్లలో మరిన్ని చర్యలు అవసరం. దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి గణనీయమైన సంస్కరణల కార్యక్రమం అవసరం. అయితే అలాంటిదేదీ ఇప్పటివరకు కనిపించడం లేదు’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖలో మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అయిన ఇలా పట్నాయక్ అన్నారు. 2012లో బిజినెస్ సైకిల్ పతనం ప్రారంభమైంది. కొత్త ప్రభుత్వం పరిస్థితులను నాటకీయంగా మార్చివేస్తుందనే ఆశాభావం బోలెడంత ఉండింది. ఆర్థిక రంగం పూర్తిస్థాయిలో కోలుకోవడం ఇప్పటివరకు కనిపించలేదు. ముఖ్యంగా ప్రైవేటు పెట్టుబడులు పుంజుకోవడం ఇప్పటివరకు కూడా కనిపించలేదు. అయితే ఉపాధి అవకాశాలను కల్పించే కొన్ని సత్వర, సులభమైన పరిష్కారాలు మాత్రం ఉన్నాయి. కానీ దీర్ఘకాలిక ఆలోచనలకు సమయం మించి పోతోంది’ అని ఆమె పిటిఐతో మాట్లాడుతూ అన్నారు.
స్థూల జాతీయ ఉత్పత్తి(జిడిపి) గణాంకాలలో కొన్ని మంచి అంశాలు కనిపిస్తున్నాయని ఆమె అంటూ, అయితే ప్రైవేటు రంగం విశ్వసనీయతను పెంచే చర్యలు ఏవీ ఇప్పటివరకు పెద్దగా ఫలితాలనివ్వలేదని, 2016-17 ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్‌ఐపిఎఫ్‌పి)లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఇలా పట్నాయక్ అన్నారు. మామూలు స్థాయికన్నా మించిన రుతుపవనాల కారణంగా వృద్ధి రేటు బాగా ఉండవచ్చన్న వార్తల గురించి అడగ్గా, జిడిపిలో వ్యవసాయం వాటా తగ్గుతుండడం, గ్రామాల్లో కార్మికులు వ్యవసాయేతర కార్యకలాపాలపట్ల మొగ్గు చూపుతున్నందున రుతుపవనాలకు మనం అనుకున్నదానికన్నా తక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఆమె అన్నారు. అంతేకాదు భారత దేశం ప్రపంచ మార్కెట్లతో ఎక్కువగా అనుసంధానం అవుతున్న దృష్ట్యా ప్రపంచ ఆర్థిక వ్యవస్థే ఎక్కువ ముఖ్యమని ఆమె అభిప్రాయ పడ్డారు. రుతుపవనాలు బాగా ఉండనున్న కారణంగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ది 8 శాతం దరిదాపుల్లో ఉండవచ్చని గత వారం ఆర్థిక కార్యదర్శి శక్తికాంత దాస్ ప్రకటించిన నేపథ్యంలో ఇలా పట్నాయక్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.