బిజినెస్

జెఎస్‌డబ్ల్యు చేతికి జెఎస్‌పిఎల్ ప్లాంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 4: బిలియనీర్ సజ్జన్ జిందాల్‌కు చెందిన జెఎస్‌డబ్ల్యు ఎనర్జీ.. తన తమ్ముడు నవీన్ జిందాల్ నేతృత్వంలోని రుణపీడిత సంస్థ జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (జెఎస్‌పిఎల్)కు చెందిన ఓ వెయ్యి మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను కొనుగోలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఒప్పందం మంగళవారం జరిగినట్లు బుధవారం విడుదలైన ఓ ప్రకటన స్పష్టం చేసింది. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో జిందాల్ పవర్ లిమిటెడ్ (జెపిఎల్) ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ప్లాంట్‌ను 6,500 కోట్ల రూపాయలకు జెఎస్‌డబ్ల్యు ఎనర్జీ దక్కించుకుంటుండగా, 2018 జూన్ 30 నాటికి ఈ ప్లాంట్ కొనుగోలు లావాదేవీలు పూర్తవుతాయని ఇరు సంస్థలు ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. నిజానికి ఈ డీల్ విలువ 4,000 కోట్ల రూపాయలే అయినప్పటికీ, ఈ ప్లాంట్ దీర్ఘకాల విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి అదనంగా మరో 2,500 కోట్ల రూపాయలు చెల్లించనుంది. కాగా, జెఎస్‌పిఎల్‌కు దాదాపు 46,000 కోట్ల రూపాయల రుణాలున్నాయి. ఈ క్రమంలో దేశీయ విద్యుత్ రంగంలో ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల పరిస్థితులు జెఎస్‌పిఎల్‌ను రాయ్‌గఢ్ ప్లాంట్ అమ్మకం వైపునకు నడిపించింది. మరికొన్ని ఇతర సంస్థల విద్యుత్ ప్లాంట్ల పరిస్థితి ఇలాగే ఉంది. ఇది ఆర్థికంగా బలంగా ఉన్న జెఎస్‌డబ్ల్యు ఎనర్జీకి కలిసి వస్తుండగా, 1,391 మెగావాట్ల జైప్రకాశ్ హైడ్రో-పవర్ ప్లాంట్లనూ జెఎస్‌డబ్ల్యు ఇప్పటికే హస్తగతం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లో ఉన్న జైప్రకాశ్ 500 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌నూ చేజిక్కించుకునేందుకు జెఎస్‌డబ్ల్యు ఎనర్జీ చర్చలు జరుపుతోంది. అంతేగాక ఒడిషాలోని మొనె్నట్ ఇస్పాత్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ 1,050 మెగావాట్ల పవర్ ప్లాంట్‌నూ కొనుగోలు చేసేందుకు జెఎస్‌డబ్ల్యు సంప్రదింపులు జరుపుతోంది. ఈ ప్లాంట్లన్నింటి కొనుగోలు.. జెఎస్‌డబ్ల్యు విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 11,500 మెగావాట్లకు తీసుకెళ్లనుంది. కాగా, జెఎస్‌పిఎల్ ప్లాంట్ కొనుగోలుకు ఆ సంస్థ భాగస్వాములతోపాటు జె ఎస్‌డబ్ల్యు ఎనర్జీ వాటాదారుల ఆమోదం రావాల్సి ఉండగా, ఆ తర్వాత ఫెయిర్ ట్రేడ్ రెగ్యులేటర్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) అనుమతి పొందాల్సి ఉంది. బిలియనీర్ సావిత్రి దేవి జిందాల్ కుమారులే సజ్జన్ జిందాల్, నవీన్ జిందాల్ అన్నది తెలిసిందే.

ఈసారి భారత జిడిపి
వృద్ధిరేటు 7.4 శాతం
హెచ్‌ఎస్‌బిసి అంచనా
న్యూఢిల్లీ, మే 4: భారత జిడిపి వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) 7.4 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం హెచ్‌ఎస్‌బిసి బుధవారం అంచనా వేసింది. సాధారణ వర్షపాతం నమోదైతే వ్యవసాయ రంగంలో పురోగతి కనిపిస్తుందని తమ నివేదికలో పేర్కొంది. కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఈసారి 7.6 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేయగా, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 7-7.75 శాతంగా, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఎడిబి) 7.4 శాతంగా, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) 7.5 శాతంగా అంచనా వేసినది తెలిసిందే.
వంటగ్యాస్ సబ్సిడీలో
ప్రభుత్వానికి రూ. 21 వేల కోట్లు ఆదా
చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ, మే 4: వంటగ్యాస్ (ఎల్‌పిజి) రాయితీలో 21,000 కోట్ల రూపాయలకుపైగా ప్రభుత్వం ఆదా చేయగలిగిందని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. బుధవారం ఇక్కడ సబ్సిడీలపై జరిగిన ఓ సెమినార్‌కు హాజరైన ఆయన మాట్లాడుతూ గడచిన రెండు ఆర్థిక సంవత్సరా (2014-15, 2015-16)ల్లో వంటగ్యాస్ కొనుగోళ్లపై రాయితీని వినియోగదారులకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం ద్వారా 21,672 కోట్ల రూపాయలు మిగిలాయన్నారు. సబ్సిడీని బ్యాంక్ ఖాతాల్లో వేయడం ద్వారా నకిలీ లబ్దిదారులకు సబ్సిడీ ప్రయోజనం దక్కలేదని, దీంతో 2014-15లో 14,672 కోట్ల రూపాయలు, 2015-16లో దాదాపు 7,000 కోట్ల రూపాయల సబ్సిడీ భారం ప్రభుత్వానికి తగ్గిందన్నారు.