బిజినెస్

ఆర్‌బిఐకి అనుగుణంగా బ్యాంకర్లు వడ్డీరేట్లను తగ్గించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 3: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వడ్డీరేట్లు (రెపో) తగ్గించినా ఆయా బ్యాంకులు మాత్రం ఈ తగ్గింపును సంస్థలు, ఖాతాదారులకు అందజేయటం లేదని తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి ఆరోపించారు. గోవర్దన్ రెడ్డి మంగళవారం రాజ్యసభ జీరో అవర్‌లో మాట్లాడుతూ రిజర్వు బ్యాంకు గత 20 నెలల్లో రెపో రేటును 150 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే, బ్యాంకులు మాత్రం రుణాలపై తమ వడ్టీ రేటును అరవై నుండి డెబ్బై పాయింట్లు మాత్రమే తగ్గించాయని గోవర్దన్ రెడ్డి తెలియజేశారు. ఆర్‌బిఐ రెపో రేటును తగ్గించిన అనంతరం బ్యాంకులు ఇళ్ల రుణం వడ్డీరేటు, కారు, పర్సనల్ రుణాల వడ్డీ రేట్లను తగ్గిస్తుందని ప్రజలు ఆశించారు కానీ వారు ఆశించిన విధంగా జరగలేదని ఆయన ఆరోపించారు. ప్రైవేట్, విదేశీ బ్యాంకులతోపాటు జాతీయ బ్యాంకులు కూడా రుణాల వడ్డీరేట్లను తగ్గించలేదని గోవర్దన్ రెడ్డి విమర్శించారు. రిజర్వు బ్యాంకు రెపోరేటును పెంచిన వెంటనే బ్యాంకులు తమ వడ్డీరేట్లను పెంచి వేస్తున్నాయిగానీ, రిజర్వు బ్యాంకు రెపోరేటును తగ్గించినప్పుడు మాత్రం వాణిజ్య, ప్రైవేట్ జాతీయ బ్యాంకులు తమ వడ్డీరేట్లను తగ్గించటం లేదని గోవర్దన్ రెడ్డి తెలిపారు. మన జాతీయ, ప్రైవేట్ బ్యాంకులతోపాటు వాణిజ్య బ్యాంకులు ఇంటర్ బ్యాంకు రేట్లను వెంటనే సవరించకుండా 13 నెలల సమయం తీసుకుని రేట్లను సవరిస్తున్నాయని, దీని వలన ఖాతాదారులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆయన ఆరోపించారు. రుణాలకు మారిన వడ్డీరేట్లను వర్తింప జేసేందుకు భారతీయ బ్యాంకులు 19 నెలల సమయం తీసుకుంటున్నాయని గోవర్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్‌బిఐ వడ్డీరేట్లను తగ్గించిన వెంటనే వాణిజ్య, జాతీయ, ప్రైవేట్ బ్యాంకులు కూడా వెంటనే అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పాల్వాయి గోవర్దన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.