బిజినెస్

ఆర్థిక ఫలితాలపై ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 1: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ఆధారంగా ట్రేడ్ అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చి వ్యవధికిగాను హెచ్‌డిఎఫ్‌సి, హీరో మోటోకార్ప్, అదానీ పోర్ట్స్ తదితర కీలక సంస్థలు ఈ వారం తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. దీంతో మదుపరులు తమ పెట్టుబడులపై ఈ ఫలితాల ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్ల కదలికలు కూడా భారతీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని విశే్లషకులు చెబుతున్నారు. ఇక గత నెల ఏప్రిల్‌లో జరిగిన అమ్మకాల వివరాలను ఆటోరంగ సంస్థలు వెల్లడించనుండటంతో ఆ ప్రభావం కూడా మార్కెట్‌పై ఉండనుంది. ‘అంతర్జాతీయ మార్కెట్ల తీరు, విదేశీ మదుపరుల పెట్టుబడులు, ముడి చమురు ధరల కదలికలు, హెచ్‌డిఎఫ్‌సి, అదానీ పోర్ట్స్, హీరో మోటోకార్ప్ తదితర కార్పొరేట్ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్ సరళిని నిర్దేశిస్తాయి.’ అని క్యాపిటల్‌వయా గ్లోబల్ రిసెర్చ్ వ్యవస్థాపకుడు, సిఇఒ రోహిత్ గుప్తా అన్నారు. అలాగే సేవలు, తయారీ రంగాలకు సంబంధించి పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పిఎమ్‌ఐ) గణాంకాలు కూడా ఈ వారం విడుదలవుతున్నాయి. దీంతో వీటి ప్రభావం కూడా సహజంగానే సూచీల ట్రేడింగ్‌పై పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు స్టాక్ మార్కెట్లకు ఒడిదుడుకులు మరికొన్ని రోజులు తప్పవని సామ్కో సెక్యూరిటీస్ సిఇఒ జిమీత్ మోదీ అంటున్నారు. కార్పొరేట్ సంస్థలు ప్రకటిస్తున్న ఆర్థిక ఫలితాలు నిరాశాజనకంగా ఉంటుండటమే దీనికి కారణమని ఆయన అన్నారు. ఇదిలావుంటే ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలను కూడా మదుపరులు దగ్గరగా గమనిస్తున్నారని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా తెలిపారు. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) తదితర కీలక బిల్లుల ఆమోదం పొందాల్సి ఉండటంతో పార్లమెంట్ వ్యవహారాలూ మార్కెట్లను ప్రభావితం చేయవచ్చన్నారు. ఇకపోతే వరుసగా రెండు వారాల లాభాల అనంతరం గత వారం స్టాక్ మార్కెట్లు నష్టపోయినది తెలిసిందే. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 232 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 50 పాయింట్ల చొప్పున కోల్పోయాయి.