బిజినెస్

కోటిన్నర మందికి వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 1: దేశ చరిత్రలో ఏ ప్రధాన మంత్రి, ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు తమ పేర్లతో ప్రభుత్వ పథకాలు ప్రారంభించిన దాఖలాలు లేవు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం తొలుత రంజాన్, సంక్రాంతి, క్రిస్‌మస్‌కు చంద్రన్న కానుకలు అందించగా, మొన్న చంద్రన్న సంచార ఆరోగ్య రథం పథకానికి, మేడే సందర్భంగా నిన్న చంద్రన్న బీమా పథకాన్ని తన చేతులు మీదుగానే ప్రారంభించి చరిత్ర సృష్టించారు. ఇక చంద్రన్న బీమా పథకం విషయానికి వస్తే దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక కోటి 50 లక్షల మందికి బీమా వర్తించేలా రూపకల్పన చేశారు. ఇందుకోసం తమ వాటా ప్రీమియంగా ప్రభుత్వం రూ. 132 కోట్లు చెల్లించనుంది. ఎంతో తెలివిగా భవన నిర్మాణ కార్మిక చట్టంతోపాటు గత మేడే రోజున రాజమండ్రిలో ఆర్భాటంగా ప్రారంభించిన డ్రైవర్‌ల బీమా పథకాన్ని కూడా ఈ పథకంలో విలీనం చేశారు. అంతేగాకుండా ప్రమాదంలో మరణిస్తే లక్ష రూపాయల బీమా అందించే కేంద్రానికి చెందిన జనధన్ బ్యాంక్ ఖాతాను లింకప్ చేయడం జరిగింది. ఇక ప్రతి కార్మికుడు కేవలం 15 రూపాయల రుసుము, బ్యాంక్ ఖాతా, ఆధార్ నకళ్లతో కార్మిక శాఖ కార్యాలయంలో అందజేస్తే చాలు ప్రమాదంలో మరణిస్తే 5 లక్షల రూపాయలు, పూర్తి అంగవైకల్యం అయితే రూ. 5 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ. 3,62,500, సహజ మరణ బీమా రూ. 30 వేలు, రూ. 1,200 చొప్పున ఇద్దరు పిల్లలకు ఉపకార వేతనం. ఈ కోటి, 50 లక్షల మందిలో ఇళ్లల్లో పనిచేసే వారు, ఇతరులు 7 లక్షల మంది, వ్యవసాయ కూలీలు 60 లక్షలు, చిన్నతరహా ఫ్యాక్టరీలు, షాపులు, దుకాణాల్లో పని చేసేవారు 38 లక్షల మంది హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు, దింపుడు కూలీలు 37 లక్షల మంది, స్వయం ఉపాధి కూలీలు 8 లక్షల మంది ఉన్నారు. గత ఏడాది పైలెట్ పథకంగా ప్రవేశపెట్టిన డ్రైవర్‌లకు బీమా పథకం కింద ప్రభుత్వం ఐదు లక్షల మందికి ఆరున్నర కోట్లు ప్రీమియంగా చెల్లిస్తుంటే, 581 క్లయిమ్స్ రాగా రూ. 11 కోట్లు మేర చెల్లింపులు జరిగాయి. ఈ పథకం కింద ఐదు లక్షల ప్రమాద మరణ బీమా, 30 వేలు సహజ మరణ బీమా, పూర్తి అంగవైకల్యానికి రూ. 75 వేలు, పాక్షిక అంగ వైకల్యంకు రూ. 37,500, ఇద్దరు పిల్లలకు రూ. 1,200 చొప్పున ఉపకార వేతనం అందించడం జరిగింది. ఇక చంద్రన్న బీమా పథకంతో డ్రైవర్‌ల బీమా పథకం రద్దయినట్లుగా భావించాల్సి ఉంది.

సింగరేణి సిఎండికి
ఉత్తమ నిర్వహణ అవార్డు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 1: సింగరేణిని జాతీయ స్థాయిలో నెంబర్ వన్‌గా నిలిపినందుకు ఆ సంస్థ సిఎండి ఎన్ శ్రీధర్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ నిర్వహణ (బెస్ట్ మేనేజ్‌మెంట్) అవార్డునిచ్చింది. మే డే సందర్భంగా ఆదివారం రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును శ్రీధర్ అందుకున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో 604 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించడమేగాక, 15 శాతం వృద్ధిరేటు సాధించి జాతీయ బొగ్గు పరిశ్రమలకే సింగరేణి తలమానికంగా నిలిచింది.
రెడ్డీస్ ల్యాబ్‌కూ..
ప్రముఖ ఔషధ, పరిశోధన సంస్థ డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్‌కు కూడా ఉత్తమ నిర్వహణ అవార్డు లభించింది. మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా రెడ్డీస్ ఉపాధ్యక్షుడు ఈ అవార్డును స్వీకరించారు.

నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా అవార్డులు తీసుకుంటున్న సింగరేణి సిఎండి, రెడ్డీస్ ల్యాబ్ ఉపాధ్యక్షుడు

2014-15లో 5.17 కోట్ల పన్ను చెల్లింపుదారులు

న్యూఢిల్లీ, మే 1: ఆదాయ పన్ను చెల్లింపుదారులు 2014-15 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 5.17 కోట్ల మందిగా ఉన్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 4.72 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. 2013-14లో 5.20 కోట్లుగా ఉండటం గమనార్హం. అయితే ఐటి రిటర్న్స్ దాఖలు చేసేవారు మాత్రం దేశ జనాభాలో కేవలం ఒక శాతంగానే ఉన్నట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. కాగా, 2012-13లో టిడిఎస్ నుంచి 2.10 లక్షల కోట్ల రూపాయల ఆదాయం సమకూరగా, 2014-15లో ఇది 6.36 లక్షల కోట్ల రూపాయలుగా ఉండటం విశేషం.

ఎస్‌పిడిసిటిఎల్
భద్రతా వారోత్సవాలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 1: తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్‌పిడిసిటిఎల్) ఆదివారం నుంచి విద్యుత్ భద్రతా వారోత్సవాలను చేపట్టింది. గ్రామాల్లో, పట్టణాల్లో విద్యుత్ వినియోగదారులను, సామాన్య ప్రజానీకాన్ని, స్వచ్ఛంధ సంస్థల కార్యకర్తలను, సిబ్బందిని భాగస్వాములు చేసుకుని ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ సిఎండి జి రఘుమారెడ్డి తెలిపారు. ఇందుకు అనుగుణంగా అన్ని ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్లు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. భద్రతా వారోత్సవాల్లో భాగంగా ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్‌లు ఏర్పాటు, వదులుగా వేలాడుతున్న తీగలను సరిచేయడం, వంగిన, తుప్పుబట్టిన స్తంభాలను సరిచేయడంతోపాటు ఎలక్ట్రికల్ రిస్క్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా విద్యుత్, అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించడం వంటి చర్యలు చేపట్టాలని సిఎండి కింది స్థాయి అధికారులకు సూచించారు. గీజర్, కంప్యూటర్‌లు వినియోగిస్తే తప్పకుండా ఎర్తింగ్ ఏర్పాటు చేసుకునేలా చైతన్యం తీసుకురావాలని పేర్కొన్నారు. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదాలకు కారణాలను విశే్లషించి భవిష్యత్తులో మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు.