బిజినెస్

చిక్కుల్లో రూ. 12 లక్షల కోట్ల రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 19: భారతీయ బ్యాంకింగ్ రంగాన్ని కార్పొరేట్ బకాయిలు వణికిస్తున్నాయి. మొత్తం దేశ బ్యాంకింగ్ వ్యవస్థ ఉనికికే మొండి బకాయిలు పెను ప్రమాదంగా మారడం కార్పొరేట్ల చలవే. దేశీయ బ్యాంకింగ్ రుణాల్లో 16.1 శాతం ఇప్పుడు చిక్కుల్లో ఉండగా, ఇవన్నీకూడా కార్పొరేట్ వర్గాలకిచ్చినవే కావడం గమనార్హం. వీటి విలువ దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు. అవును.. దేశంలోని బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాల విలువ ప్రస్తుతం 1,109 బిలియన్ డాలర్లుగా ఉంటే, అందులో 178 బిలియన్ డాలర్ల రుణాలు డిఫాల్ట్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. డాలర్‌తో పోల్చితే ప్రస్తుతం రూపాయి విలువ ప్రకారం ఈ మొత్తం 11,84,590 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా వివిధ కార్పొరేట్ వర్గాలు తీసుకున్నవే. ఈ క్రమంలో ఆసియా దేశాల్లో భారత బ్యాంకింగ్ వ్యవస్థ అస్సలు బాగోలేదని, మొండి బకాయిల్లో భారత్ మొదటి స్థానంలో ఉందని ఫ్రాన్స్ ఫైనాన్షియల్ దిగ్గజం బిఎన్‌పి పరిబాస్ ఓ నివేదికలో తెలిపింది. ఈ విషయంలో ఇండోనేషియా 7.2 శాతంతో రెండో స్థానంలో, చైనా 6.6 శాతంతో మూడో స్థానంలో ఉన్నాయని పరిబాస్ చెప్పింది. ఇండోనేషియా మొత్తం బ్యాంకింగ్ రుణాలు 305 బిలియన్ డాలర్లుగా ఉంటే, 22 బిలియన్ డాలర్లు మొండి బకాయిలుగా ఉన్నాయని, అలాగే చైనాలో 15,884 బిలియన్ డాలర్లకు 1,050 బిలియన్ డాలర్లు మొండి బకాయిలుగా ఉన్నాయని పేర్కొంది. ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లలో లిస్టయిన 738 సంస్థలపై విశే్లషణ చేసి ఈ వివరాలను తాజాగా వెల్లడించింది పరిబాస్. ఈ సంస్థల స్థూల రుణాల విలువ 1.7 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. వీటి పూర్వాపరాలను తెలుసుకుని ఈ మొత్తాన్ని మొండి బకాయిలుగా తమ నివేదికలో పరిబాస్ తెలిపింది. ‘పెరుగుతున్న కార్పొరేట్ మొండి బకాయిలు ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా పరిణమించాయి.’ అని ఆ నివేదికలో పరిబాస్ పేర్కొంది. ఇక మొండి బకాయిల సమస్యలను ఎదుర్కొంటున్న టాప్-5 దేశాల బ్యాంకుల్లో నాలుగో స్థానం కొరియా (5.8 శాతం), ఐదో స్థానంలో థాయిలాండ్ (2.4 శాతం) ఉన్నాయి. నిజానికి ప్రతి దేశం మొండి బకాయిల సమస్యకు వివిధ మార్గాల్లో పరిష్కారాలను అనే్వషించే పనిలో ఇప్పుడు తీవ్రంగా నిమగ్నమయ్యాయని పరిబాస్ నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం ఈ దిశగా చర్యలు చేపడుతూనే ఉన్నది తెలిసిందే. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా విషయంలో కేంద్రం అనుసరిస్తున్న కఠిన వైఖరే ఇందుకు నిదర్శనం. 17 బ్యాంకుల నుంచి 9,000 కోట్ల రూపాయలకుపైగా రుణాలు తీసుకుని, వాటిని చెల్లించక లండన్ పారిపోయాడన్న అపకీర్తిని మాల్యా ఎదుర్కొంటున్నది తెలిసిందే. 900 కోట్ల రూపాయల ఐడిబిఐ బ్యాంక్ రుణం ఎగవేత వ్యవహారంలో మనీలాండరింగ్ కేసునూ ఎదుర్కొంటున్న మాల్యాపై ఇడి సూచనతో ప్రత్యేక పిఎమ్‌ఎల్‌ఎ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసినది విదితమే.