బిజినెస్

దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఏప్రిల్ 19: భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని, వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ భారత ఆర్థిక వ్యవస్థ పురోగతిపై స్పందిస్తూ ‘గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటి కన్ను ఉన్నవాడే రాజు’ అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో జైట్లీ పైవిధంగా ప్రతిస్పందించారు. ఇతర దేశాలతో పోల్చితే భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచంలోని ఏ దేశమైనా 7.5 శాతం వృద్ధిరేటు వద్ద ఉందా? అన్న ఆయన అది భారత్ సొంతమని గుర్తుచేశారు. అమెరికా పర్యటనలో ఉన్న జైట్లీ సిఎన్‌బిసి టివి18తో మాట్లాడారు. ఈ సందర్భంగానే ఓ ప్రశ్నకు సమాధానంగా రాజన్ వ్యాఖ్యలను ఖండించారు. అమెరికాలో ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) సమావేశాలకు జైట్లీతోపాటు హాజరైన రాజన్.. గత వారం భారత్‌ను తరచూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వెలుగు రేఖగా అభివర్ణిస్తున్నారేం? అన్నదానిపై మాట్లాడుతూ గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటి కన్ను ఉన్నవాడే రాజు అని అన్నది తెలిసిందే. ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలు బాగోలేని ప్రస్తుత తరుణంలో అంతంతమాత్రంగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థపైనే అందరి చూపూ ఉంటుందని, అది సహజమే అన్నారు. అంతేగాని భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ లేదని వ్యాఖ్యానించారు. దీనిపై జైట్లీ ఘాటుగా స్పందించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణల మధ్య ఈసారి వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా కురిసినట్లైతే దేశ జిడిపి వృద్ధిరేటు మరింతగా పెరగడం ఖాయమన్నారు. రాజ్యసభలో కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఆమోదం పొందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన ఆయన దీంతోపాటు దివాళా బిల్లు అమల్లోకి వస్తే దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపథంలో దూసుకెళ్తుందన్నారు. కాగా, వొడాఫోన్ పన్ను వ్యవహారంపై అడిగిన ప్రశ్నకు బదులుగా తాను ప్రత్యేకంగా ఏ సంస్థ గురించి మాట్లాడబోనని, అయతే సరళతర మైన పన్నుల విధానానికి కృషి చేస్తున్నామన్నారు.

న్యూయార్క్‌లో అరుణ్ జైట్లీ