బిజినెస్

ఆర్థిక ఫలితాలే దిక్సూచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఆర్థిక ఫలితాల ఆధారంగా ట్రేడ్ అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో చివరి త్రైమాసికమైన జనవరి-మార్చికి ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు మదుపరులపై ప్రభావం చూపుతాయని, ఆయా సంస్థలు వెల్లడించే లాభనష్టాల ప్రకారం తమ పెట్టుబడులపై మదుపరులు నిర్ణయానికి వస్తారన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత శుక్రవారం దేశీయ ఐటిరంగ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ప్రకటించిన ఆర్థిక ఫలితాలు సోమవారం మార్కెట్ ట్రేడింగ్‌ను ప్రభావితం చేస్తాయని అంటున్నారు. శుక్రవారం శ్రీరామ నవమి సందర్భంగా మార్కెట్లు మూతబడినది తెలిసిందే. జనవరి-మార్చిలో అంచనాలను మించి ఇన్ఫోసిస్ లాభాలను అందుకున్న నేపథ్యంలో మదుపరులు ఐటిరంగ షేర్ల కొనుగోళ్లకు అమితాసక్తిని ప్రదర్శించవచ్చన్న అంచనాలు కూడా నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. దీంతో ఇన్ఫోసిస్‌తోపాటు టిసిఎస్ షేర్లు వెలుగులోకి రావచ్చని ట్రేడ్ స్మార్ట్‌లైన్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ విజయ్ సింఘానియా అన్నారు. గతంతో పోల్చితే 16.2 శాతం వృద్ధితో 3,597 కోట్ల రూపాయల లాభాన్ని ఇన్ఫోసిస్ పొందింది. ఇకపోతే సోమవారం మార్చి నెలకుగాను టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు విడుదలవుతుండటంతో ఆ ప్రభావం కూడా మార్కెట్ సరళిపై ఉంటుందని పేర్కొంటున్నారు. కాగా, ఈసారి వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుందన్న అంచనాల మధ్య వ్యవసాయ ఆధారిత షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించవచ్చని క్యాపిటల్‌వయా గ్లోబల్ రిసెర్చ్ వ్యవస్థాపకుడు, సిఇఒ రోహిత్ గదియా అన్నారు. ఇక ఈ వారం దేశీయ మూడో అతిపెద్ద ఐటిరంగ సంస్థ విప్రోతోపాటు, ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తమ నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. మంగళవారం మహావీర్ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవు. తిరిగి బుధవారం యథాతథంగా ట్రేడింగ్ జరుగుతుందని మార్కెట్ వర్గాలు తెలిపాయ. మరోవైపు డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల కదలికలు, గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, విదేశీ మదుపరుల పెట్టుబడులు కూడా భారతీయ స్టాక్ మార్కెట్ల తీరును శాసిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాగా, గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ జరిగినది మూడు రోజులే అయినప్పటికీ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 952.91 పాయింట్లు పుంజుకుంది. ఫలితంగా తిరిగి 25 వేల స్థాయికి చేరుకున్న సూచీ.. 25,626.75 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 295.25 పాయింట్లు ఎగిసింది. 7,800 మార్కును అధిగమించి 7,850.45 వద్ద నిలిచింది. నిజానికి అంతకుముందు రెండు వారాల్లో మార్కెట్లు నష్టాలకే పరిమితమయ్యాయి. సెనె్సక్స్ ఈ రెండు వారాల్లో 663.72 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ కూడా 161.30 పాయింట్లు దిగజారింది. అయితే వర్షసూచన అంచనాలు మదుపరులను పెట్టుబడుల వైపు నడిపించాయ.