బిజినెస్

భువనేశ్వర్‌లో మొదలైన గూగుల్ ఉచిత వైఫై సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, ఏప్రిల్ 17: ఆదివారం భువనేశ్వర్ రైల్వేస్టేషన్‌లో ఉచిత వైఫై సౌకర్యాన్ని గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. దీన్ని రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ప్రారంభించారు. స్మార్ట్ఫోన్ కలిగిన ప్రతి ప్రయాణికుడు ఈ ఉచిత వైఫై సేవలను పొందవచ్చు. దేశంలో ముంబయ సెంట్రల్ రైల్వేస్టేషన్ తర్వాత గూగు ల్ ఉచిత వైఫై ఉన్నది ఇప్పుడు భువనేశ్వర్ రైల్వేస్టేషన్‌లోనే. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా గూగుల్ సాయంతో ఈ ఏడాది ఆఖరుకల్లా దేశవ్యాప్తంగా రద్దీగల 100 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలను రైల్వే శాఖ తీసుకురానుంది. త్వరలో మరో 10కిపైగా స్టేషన్లకు ఈ సౌకర్యం కల్పించనుండగా, వాటి లో తెలుగు రాష్ట్రాల్లోని కాచిగూడ, విజయవాడ, విశాఖపట్టణం ఉన్నాయ. దేశవ్యాప్తంగా 400 రైల్వేస్టేషన్లలో ఫ్రీ వైఫై సేవలను అందించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఆదివారం భువనేశ్వర్ రైల్వేస్టేషన్‌లో గూగుల్ ఉచిత వైఫైని ప్రారంభిస్తున్న రైల్వే మంత్రి సురేశ్ ప్రభు