బిజినెస్

37 శాతం పెరిగిన ఎఫ్‌డిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) గత ఏడాది 37 శాతం పెరిగి 39.32 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది 28.78 బిలియన్ డాలర్లకే ఎఫ్‌డిఐ పరిమితమైనట్లు పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక శాఖ (డిఐపిపి) తెలియజేసింది. కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రంగంలోకి అత్యధికంగా ఎఫ్‌డిఐ వచ్చింది. ఆ తర్వాత సేవలు, ట్రేడింగ్, ఆటోమొబైల్, రసాయన పరిశ్రమలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. సింగపూర్ నుంచి ఎక్కువగా ఎఫ్‌డిఐ రాగా, మారిషస్, అమెరికా, నెదర్లాండ్స్, జపాన్ దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
రికార్డు స్థాయిలో ఉల్లి ఉత్పత్తి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: దేశీయంగా ఉల్లిగడ్డ ఉత్పత్తి 2015-16 పంట సంవత్సరం (జూలై-జూన్)లో రిక్డార్డు స్థాయిలో 203 లక్షల టన్నులుగా నమోదైంది. వాతావరణం అనుకూలించడం, మార్కెట్‌లో ధరలు భారీగా ఉండటం మధ్య రైతులు పెద్ద ఎత్తున ఉల్లిని సాగు చేశారు. దీంతో ఓ సరికొత్త రికార్డు సాధ్యమైందని నేషనల్ హార్టికల్చరల్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌డిఎఫ్) డైరెక్టర్ ఆర్‌పి గుప్తా పిటిఐకి తెలిపారు. కాగా, 2014-15లో 189.2 లక్షల టన్నులు, 2013-14లో 194 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది.
అమ్ముడైన టాప్-10 కార్లలో
ఆరు మోడల్స్ మారుతివే
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: దేశీయంగా గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కార్లలో మారుతి సుజుకికి చెందినవే ఆరు మోడల్స్ ఉన్నాయి. 2014-15లోనూ ఐదు కార్లు మారుతివే ఉన్నాయ. కాగా, అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కార్లలో తొలి నాలుగు స్థానాల్లో మారుతి ఆల్టో, డిజైర్, స్విఫ్ట్, వాగనార్‌లున్నాయి. 5, 6 స్థానాల్లో హ్యుందాయ్ ఐ10, ఎలైట్ ఐ20 ఉండగా, ఆ తర్వాత మారుతి సెలీరియో (7), మహీంద్ర ఎస్‌యువి బొలెరో (8), మారుతి ఓమిని వ్యాన్ (9), హోండా సిటీ (10) ఉన్నాయి.

రూ. 10 లక్షల కోట్లకు మొండి బకాయిలు?
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: ఈ మార్చి 31 నాటికి బ్యాంకుల మొండి బకాయిలు 10 లక్షల కోట్ల రూపాయలను తాకవచ్చని ఓ నివేదిక అంచనా వేసింది. ఉక్కు, టెక్స్‌టైల్స్, అల్యూమినియం వంటి కీలక రంగాల్లో నెలకొన్న మందగమనం మధ్య బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు, పునర్వ్యవస్థీకరీంచిన రుణాలు కలిపి ప్రస్తుత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మొండి బకాయిల సమీక్షలో 10 లక్షల కోట్ల రూపాయలుగా తేలవచ్చని పారిశ్రామిక సంఘం అసోచామ్ సర్వే పేర్కొంది. గత ఏడాది డిసెంబర్ నాటికి ఇవి 8 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయి.