బిజినెస్

చిన్న షేర్లు కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: పెద్ద షేర్లతో పోల్చితే చిన్న షేర్లు ఈ ఏడాది అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో మదుపరుల ఆదరణకు నోచుకోక స్మాల్-క్యాప్ సూచీ ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటిదాకా 7.5 శాతం క్షీణించింది. ఇదే సమయంలో మిడ్-క్యాప్ సూచీ కేవలం 2 శాతం పడిపోవడం గమనార్హం. బ్లూచిప్ సూచీ సైతం 1.87 శాతం మాత్రమే కోల్పోయింది. తాజా గణాంకాల ప్రకారం ప్రస్తుతం స్మాల్-క్యాప్ సూచీ 7.55 శాతం నష్టపోయి 10,943.02 వద్ద ఉండగా, మిడ్-క్యాప్ సూచీ 2 శాతం కోల్పోయి 10,916.30 వద్ద కదలాడుతోంది. బ్లూచిప్ సూచీ సెనె్సక్స్ 1.87 శాతం పడిపోయి 25,626.75 వద్ద ఉంది.
ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 29న స్మాల్, మిడ్, బ్లూచిప్ సూచీలు అత్యంత కనిష్ట స్థాయిని తాకాయి. స్మాల్-క్యాప్ 9,399.43 పాయింట్ల ఆల్‌టైమ్ కనిష్టానికి పతనమవగా, గత ఏడాది ఆగస్టు 5న నమోదైన ఆల్‌టైమ్ గరిష్ఠం 12,203.64 పాయింట్లతో చూస్తే ఇది 10 శాతానికిపైగా తక్కువ. మిడ్-క్యాప్ కూడా 9,389.35 పాయింట్ల ఆల్‌టైమ్ కనిష్టానికి దిగజారగా, గత ఏడాది ఆగస్టు 10న నమోదైన 11,666.24 పాయింట్ల ఆల్‌టైమ్ గరిష్ఠానికి 6 శాతానికిపైగా తక్కువ. సెనె్సక్స్ కూడా 22,494.61 పాయింట్లకు పడిపోయి ఏడాది కనిష్టానికి చేరింది. గత ఏడాది మార్చి 4న సెనె్సక్స్ 30,024.74 పాయింట్లను తాకి ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిని నెలకొల్పింది. దీంతో ఏడాది వ్యవధిలో సెనె్సక్స్ 17 శాతానికిపైగా కోల్పోయినట్లైంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో ఒడిదుడుకులు, చైనా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు స్టాక్ మార్కెట్ నష్టాలకు ప్రధాన కారణంగా ఉన్నాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను కేంద్రం ప్రవేశపెట్టిన సాధారణ వార్షిక బడ్జెట్‌తో మార్కెట్ నష్టాలు కాస్త తగ్గాయనే చెప్పొచ్చు.
మొత్తానికి గత రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది స్మాల్-క్యాప్, మిడ్-క్యాప్ సూచీలకు ప్రతికూల పరిస్థితులే ఎదురవుతున్నాయి. 2015లో స్మాల్, మిడ్-క్యాప్ షేర్లు 7.4 శాతం వరకు లాభాలను అందుకున్నాయి. అయితే సెనె్సక్స్ మాత్రం 1,381.88 పాయిం ట్లు క్షీణించింది. మదుపరులు పెద్ద షేర్ల కంటే చిన్న షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి కనబరిచారు మరి. నిజానికి 2014 లో చిన్న, మధ్యతరహా షేర్లతోపాటు పెద్ద షేర్లలో పెట్టుబడులకూ మదుపరులు ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే సెనె్సక్స్ దాదాపు 30 శాతం వరకు పుంజుకుంది. సాధారణంగా పెద్ద షేర్లలో పెట్టుబడులకు విదేశీ మదుపరులే అధికంగా ముందుకొస్తారు. దేశీయ మదుపరులు చిన్న, మధ్యతరహా షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తారు. బ్లూచిప్ సంస్థల మార్కెట్ విలువలో సగటున 5 శాతంగా ఉన్నవి మధ్యతరహా సంస్థలుగా, 10 శాతంగా ఉన్నవి చిన్నతరహా సంస్థలుగా పరిగణిస్తారు. బ్లూచిప్ సంస్థల సూచీగా సెనె్సక్స్ ఉంటే, మధ్యతరహా సంస్థల సూచీగా మిడ్-క్యాప్, చిన్నతరహా సంస్థల సూచీగా స్మాల్-క్యాప్ ఉంటాయి.