బిజినెస్

జనవరికల్లా పేమెంట్స్ బ్యాంక్: తపాలా శాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: వచ్చే ఏడాది జనవరికల్లా పేమెంట్స్ బ్యాంక్‌ను ప్రారంభిస్తామని తపాలా శాఖ తెలిపింది. తపాలా శాఖతోపాటు 10 ఇతర సంస్థలకు గత ఏడాది ఆగస్టులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటు కోసం అనుమతులిచ్చినది తెలిసిందే. ఈ అనుమతి 18 నెలల వరకే వర్తిస్తుంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది జనవరి నాటికి పేమెంట్స్ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తామని తపాలా శాఖ సీనియర్ అధికారి ఒకరు బుధవారం ఇక్కడ తెలిపారు. ఇప్పటికే ఏడు నెలలు గడిచి పోయినందున ఇక ఈ ప్రక్రియను వేగవంతం చేస్తామని వెస్టర్న్ యూనియన్‌తో 15 ఏళ్ల భాగస్వామ్యానికి గుర్తుగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తపాలా శాఖ బ్యాంకింగ్ సభ్యుడు, హెచ్‌ఆర్‌డి ఎమ్‌ఎస్ రామానుజన్ అన్నారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) పేరుతో ఏర్పాటయ్యే ఈ బ్యాంక్‌లో సిబ్బంది కోసం తపాలా శాఖ ఉద్యోగులతోపాటు కొత్తవారిని నియమించుకోనున్నామని చెప్పారు. అయితే పేమెంట్స్ బ్యాంక్ ఉన్నతోద్యోగులు మాత్రం జూలై వరకు బాధ్యతల్లోకి రావచ్చన్నారు. ఇప్పటికే పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటుకు వీలుగా నిధులకు సంబంధించి తపాలా శాఖకు పబ్లిక్ ఇనె్వస్ట్‌మెంట్ బోర్డు (పిఐ బి) నుంచి ఆమోదం కూడా వచ్చిందన్నారు.