బిజినెస్

పదకొండేళ్ల జాయింట్ వెంచర్‌కు ఎమ్మార్, ఎమ్‌జిఎఫ్ స్వస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దుబాయ్‌కి చెందిన నిర్మాణరంగ సంస్థ ఎమ్మార్ ప్రాపర్టీస్, దేశీయ సంస్థ ఎమ్‌జిఎఫ్ డెవలప్‌మెంట్.. తమ పదకొండేళ్ల జాయింట్ వెంచర్‌కు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నాయి. ఎమ్మార్ ఎమ్‌జిఎఫ్ ల్యాండ్ లిమిటెడ్‌ను విడదీయడం ద్వారా జాయింట్ వెంచర్‌కు ముగింపు పలకనున్నాయి. 2005లో భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డిఐ)తో భారతీయ నిర్మాణ రంగంలోకి ఎమ్మార్ ప్రాపర్టీస్ ప్రవేశించగా, ఎమ్మార్ ఎమ్‌జిఎఫ్ ద్వారా దాదాపు 8,500 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టింది. ఈ జాయింట్ వెంచర్‌లో ఎమ్మార్, ఎమ్‌జిఎఫ్‌లకు చెరో 49 శాతం వాటా ఉండగా, మిగతా రెండు శాతం వాటాను పలు ఆర్థిక సంస్థలు కలిగి ఉన్నాయి. గుర్గావ్, చెన్నై, హైదరాబాద్, ఇండోర్ తదితర నగరాల్లో నివాస, వాణిజ్య, రిటైల్, హాస్పిటాలిటీ ప్రాజెక్టులను ఎమ్మార్ ఎమ్‌జిఎఫ్ ల్యాండ్ లిమిటెడ్ చేపట్టింది.

మియర్స్క్‌తో కృష్ణపట్నం పోర్ట్ భాగస్వామ్యం

వెల్లడించిన పోర్టు ఎండి చింతా శశిధర్

హైదరాబాద్, ఏప్రిల్ 13: సలాలాహ్, ఒమన్ నుంచి నూతన సేవలను పరిచయం చేయడం కోసం మియర్స్క్‌తో కృష్ణపట్నం పోర్ట్ భాగస్వామ్యం చేసుకుంది. ఈ మేరకు పోర్ట్ ఎండి చింతా శశిధర్ బుధవారం తెలిపారు. ఈ నూతన సేవల ద్వారా ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు, తూర్పు కర్ణాటక ప్రాంతాలలోని వినియోగదారులను నేరుగా ఒమన్, సమీపంలోని ప్రాంతాలకు కనెక్ట్ చేయగలుగుతామని చెప్పారు. మియర్స్క్ లైన్‌తో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. కాగా, నూతన సేవల ద్వారా ఈ ప్రాంతంలో రవాణాకు తీసుకునే సమయం గణనీయంగా తగ్గడంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుందని, దీని వల్ల వినియోగదారులకు లబ్ది కలుగుతుందని అన్నారు. ఈ నెల 17 నుంచి ఈ సేవలు వారానికోసారి అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.

గీతం వర్శిటీతో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం

హైదరాబాద్, ఏప్రిల్ 13: పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వడానికి ప్రముఖ ఔషధ పరిశ్రమ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ హైదరాబాద్ గీతం విశ్వవిద్యాయలంతో ఒప్పందం చేసుకుంది. ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతిభ కలిగిన గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఎంపిక చేసుకుని పరిశ్రమలకు అనువుగా మానవ వనరులను తయారు చేసుకునేందుకు ఈ ఒప్పందం చేసుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ అధ్యక్షుడు, గ్లోబల్ హెచ్‌ఆర్ ప్రతినిధి డాక్టర్ ఎస్ చంద్రశేఖర్ బుధవారం తెలిపారు.