బిజినెస్

ఆర్థిక వ్యవస్థ జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: దేశ ఆర్థిక వ్యవస్థ జోరు మీదున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పారిశ్రామికోత్పత్తి (ఐఐపి) సూచీ 2 శాతానికి పెరగగా, మార్చి నెలలో చిల్లర ద్రవ్యోల్బణం 6 నెలల కనిష్టానికి దిగివచ్చింది మరి. కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గణాంకాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.83 శాతంగా నమోదైంది. దీంతో రాబోయే ద్రవ్యసమీక్షల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కీలక వడ్డీరేట్లను మరింతగా తగ్గించేందుకు అవకాశాలు ఏర్పడ్డాయని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా పారిశ్రామి కోత్పత్తి గణాంకాలు వరుసగా మూడు నెలలపాటు క్షీణించి, మళ్లీ ఫిబ్రవరిలో కోలుకోవడం గమనార్హం. నవంబర్‌లో మైనస్ 3.4 శాతం, డిసెంబర్‌లో మైనస్ 1.2 శాతం, జనవరిలో మైనస్ 1.5 శాతంగా ఉంది.

రోజుకు రూ. 350 కోట్ల నష్టం
పొగాకు అస్పష్ట విధానంపై అసోచామ్

హైదరాబాద్, ఏప్రిల్ 12: పొగాకు ఉత్పత్తులపై కేంద్రం అనుసరిస్తున్న అస్పష్ట విధానాల వల్ల పొగాకు పరిశ్రమకు సగటున రోజుకు రూ. 350 కోట్ల నష్టం వస్తోందని అసోచామ్ ప్రకటించింది. పొగాకుపై ఆధారపడిన సిగరెట్ పరిశ్రమ ప్రమాదంలో పడిందంది. పొగాకు పరిశ్రమపై ఆధారపడి 45 మిలియన్ల మంది జీవిస్తున్నారని, దేశంలో పొగాకు వినిమయంలో చట్టబద్ధంగా ఉన్న పరిశ్రమల వాటా 11 శాతమని పేర్కొంది. కేంద్ర విధానాల వల్ల ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో పొగాకు రైతులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారన్నారని, ఇప్పటికే కరవు కోరల్లో 10 రాష్ట్రాల రైతులు చిక్కుకున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది.

ప్రెస్టీజ్ చేతికి బ్రిటన్ హోమ్‌వేర్స్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: టిటికె ప్రెస్టీజ్.. బ్రిటన్‌కు చెందిన సిలంపస్‌ను సొంతం చేసుకుంది. దీని ద్వారా టేబుల్, కుక్‌వేర్ల తయారీ విభాగం హార్వుడ్ హోమ్‌వేర్స్ ప్రెస్టీజ్ వశమవగా, ఎంత మొత్తానికి కొనుగోలు చేసిందన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. అయితే టిటికె ప్రెస్జీట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన టిటికె బ్రిటీష్ హోల్డింగ్స్ లిమిటెడ్ ద్వారా ఈ కొనుగోలు జరిగింది. ఈ కొనుగోలుతో యూరోపియన్ మార్కెట్‌లో టిటికె వ్యాపార విస్తరణ వేగంగా జరగగలదన్న ఆశాభావాన్ని టిటికె ప్రెస్టీజ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టిటి జగన్నాథన్ వ్యక్తం చేశారు.

వడ్డీరేట్లను తగ్గించిన యాక్సిస్ బ్యాంక్

ముంబయి, ఏప్రిల్ 12: దేశీయంగా మూడో అతిపెద్ద ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన యాక్సిస్ బ్యాంక్ రుణాలపై వడ్డీరేట్లను మంగళవారం 0.15 శాతం తగ్గించింది. దీంతో మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేటు (ఎమ్‌సిఎల్‌ఆర్) 9.10 శాతం నుంచి 8.95 శాతానికి దిగివచ్చింది. ఈ నెల 18 నుంచి కొత్త వడ్డీరేట్లు అమల్లోకి రానున్నాయని ఓ ప్రకటనలో బ్యాంక్ తెలిపింది. ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ, ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సిల ఎమ్‌సిఎల్‌ఆర్ కూడా 8.95 శాతం వద్దే ఉంది. ఎమ్‌సిఎల్‌ఆర్ విధానం ఇటీవలే మొదలైంది.