బిజినెస్

తెరుచుకున్న నగల దుకాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ఆభరణాల వర్తకులు తిరిగి తమ దుకాణాలను తెరిచారు. మంగళవారం దేశవ్యాప్తంగా చాలాచోట్ల నగల షాపు ల్లో వ్యాపారం జరిగింది. వెండి మినహా మిగ తా ఆభరణాలపై 1 శాతం ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తున్నట్లు బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించడంతో గత నెల 2 నుంచి దేశవ్యాప్తంగా జ్యుయెలర్లు నిరవధిక బంద్‌ను పాటిస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా బులియన్ ట్రేడర్లతోపాటు ఢిల్లీ, ముం బయి, తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్‌లలో చాలావరకు నగల షాపులు మంగళవారం తెరుచుకున్నాయి. దీంతో బంద్ ప్రభావం తగ్గిపోగా, పాక్షికంగా షాపులు మూతబడినట్లు కనిపించాయి. ఎక్సైజ్ సుంకం పెంపు ప్రభావాన్ని తగ్గిస్తామని రాజస్థాన్ ప్రభుత్వం హామీనిచ్చిన నేపథ్యంలో ఇక్కడ కూడా వ్యాపార లావాదేవీలు ప్రారంభమయ్యాయని రాజస్థాన్ సరఫ సంఘ్ అధ్యక్షుడు సుభాష్ మిట్టల్ పిటిఐకి తెలిపారు. కాగా, పూర్తిస్థాయిలో జ్యుయెలర్లు తమ బంద్‌ను విరమించుకునే రోజు దగ్గర్లోనే ఉన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. జ్యు యెలర్ల అన్ని డిమాండ్లను ప్రభుత్వం నియమించిన అశోక్ లహ్రీ కమిటీ పరిగణనలోకి తీసుకునే వీలుండటమే కారణం. ఇప్పటికే దేశవ్యాప్తంగా 60-70 శాతం జ్యుయెలర్లు బంద్ నుంచి వైదొలిగారు. ఎక్సైజ్ సుంకంతోపాటు నగల కొనుగోళ్లకు పాన్ కార్డు వినియోగాన్నీ వ్యాపారులు వ్యతిరేకిస్తున్నది తెలిసిందే.
రూ. 29,630 పలికిన పసిడి
సుధీర్ఘకాలం అనంతరం చాలాచోట్ల బంగారం అమ్మకాలు మొదలైన నేపథ్యంలో మంగళవారం చెన్నైలో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర గరిష్ఠంగా 29,630 రూపాయలు పలికింది. ఆ తర్వాత కోల్‌కతాలో 29,620 రూపాయలుండగా, ముంబయిలో 29,250 రూపాయలు, ఢిల్లీలో 29,150 రూపాయలుగా ఉంది.