బిజినెస్

సంక్షోభంలో గ్రానైట్ పరిశ్రమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఏప్రిల్ 12: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గ్రానైట్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకపక్క యూరప్ దేశాల్లో భవన నిర్మాణాలు తగ్గి భారీగా గ్రానైట్ ఎగుమతులు రాష్ట్రం నుండి పడిపోవటం, మరొకపక్క రాష్ట్ర ప్రభుత్వం రాయల్టీల పేరుతో 60 శాతం వసూలు చేయడంతో గ్రానైట్ వర్గాలపై పుండుమీద కారం చల్లినట్లైంది. దీంతో త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి సమస్యను విన్నవించనున్నట్లు జిల్లా గ్రానైట్ కార్వీల యజమానుల అసోసియేషన్ కార్యదర్శి అజీం ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. రాష్ట్రంలో ప్రకాశం, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో గ్రానైట్ పరిశ్రమ విస్తరించి ఉంది. అయతే యూరప్ దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవటంతో నిర్మాణ రంగం మందగించగా, ఒక్క ప్రకాశం జిల్లా నుండి ప్రతినెలా 30 వేల క్యూబిక్ మీటర్లు వెళ్లే గ్రానైట్ రాయి 16 వేల క్యూబిక్ మీటర్లకు పడిపోయింది. ఫలితంగా జిల్లాలోని గ్రానైట్ క్వారీల వద్ద గ్రానైట్ రాళ్లు పెద్దఎత్తున దర్శనమిస్తున్నాయి. దీంతో యజమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా, వ్యాపారం తగ్గినప్పటికీ ఖర్చులు మాత్రం తగ్గలేదని, ఎగుమతులు లేకపోవటంతో రానున్న రోజుల్లో మరింతగా పరిశ్రమ సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉందన్న భయం పరిశ్రమ వర్గాల్లో నెలకొంది. గ్రానైట్ పరిశ్రమ ద్వారా కోట్లాది రూపాయల విదేశీ మారకద్రవ్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చేది. కానీ ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంతో విదేశీ మారకద్రవ్యం కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రాయల్టీ ఫీజును 60 శాతానికి పెంచింది. దీంతో జిల్లాలోని గ్రానైట్ క్వారీల యజమానులపై నెలకు 78 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది. 2015 సంవత్సరం నవంబర్ నెలలో సీనరేజి ఫీజు 30 శాతం పెంచారు. దాన్ని ఈ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన జీవో నెంబరు 36 ద్వారా మరో 30 శాతం రాయల్టీ ఫీజును పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గ్రానైట్ వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఈ 30 శాతం డిస్ట్రిక్ మినరల్ ఫౌండేషన్ ఖాతాకు వెళ్తుందని అజీం వెల్లడించారు. వ్యవసాయ రంగం తరువాత గ్రానైట్ రంగంలో లక్షా ఆరువేల మంది కూలీలు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఇలాంటి పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా గ్రానైట్ పరిశ్రమకు అనుబంధంగా చిన్నచిన్న గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి. పెరిగిన రాయల్టీ ప్రభావంతో ఆ ప్రభావం వాటిపైనా పడనుంది.