బిజినెస్

మూడు నెలలకోసారి ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి వడ్డీ చెల్లింపులను మూడు నెలలకోసారి (త్రైమాసికం) జరపాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సూచించింది. ఈ మేరకు ఈ నెల 3న ఓ మాస్టర్ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఇది కోట్లాదిమంది పొదుపు ఖాతాదారులకు (సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లు) ప్రయోజనం చేకూర్చనుంది. ప్రస్తుతం సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న నగదుకు ఆరు నెలలకోసారి (అర్ధ వార్షికం) బ్యాంకులు వడ్డీలను చెల్లిస్తున్నాయి. కాగా, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లపై వడ్డీరేటును 2010 ఏప్రిల్ 1 నుంచి రోజువారీగా లెక్కగడుతున్నారు. ఇక సేవింగ్స్ డిపాజిట్‌పై ప్రభుత్వరంగ బ్యాంకులైతే 4 శాతం వడ్డీని, ప్రైవేట్‌రంగ బ్యాంకులైతే 6 శాతం వడ్డీని చెల్లిస్తున్నాయి. సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ రేట్లపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను వాణిజ్య బ్యాంకులకు ఆర్‌బిఐ 2011లో ఇచ్చింది. అయితే లక్ష రూపాయల వరకున్న డిపాజిట్లపై అన్ని బ్యాంకులు ఒకే రకమైన వడ్డీరేటును చెల్లించాలన్న ఆర్‌బిఐ.. ఆపై మొత్తాలకు బ్యాంకులు తమ ఇష్టానుసారం ఇచ్చుకోవచ్చని తెలిపింది. మరోవైపు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లపై వడ్డీరేటును మూడు నెలలకోసారి చెల్లించడం వల్ల బ్యాంకులపై 500 కోట్ల రూపాయల భారం పడవచ్చని నిపుణులు విశే్లషిస్తున్నారు.

- ఎఫ్‌డిసి ఎఫెక్ట్ -
విక్స్ యాక్షన్ 500 ఎక్స్‌ట్రా
అమ్మకాలు నిలిపివేత
న్యూఢిల్లీ, మార్చి 15: ఎఫ్‌ఎమ్‌సిజి సంస్థ ప్రాక్టర్ అండ్ గాంబుల్ (పిఅండ్‌జి).. తమ పాపులర్ బ్రాండ్ ఔషధం ‘విక్స్ యాక్షన్ 500 ఎక్స్‌ట్రా’ తయారీ, అమ్మకాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌డిసి) ఔషధాలపై కేంద్ర ప్రభుత్వ నిషేధం నేపథ్యంలో పిఅండ్‌జి ఈ నిర్ణయం తీసుకుంది. ‘300లకుపైగా ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ ఔషధాల (పారాసిటమల్, ఫెనిలెఫ్రైన్, కఫైన్ కలిసిన) తయారీ, పంపిణీ, విక్రయాలపై భారత ప్రభుత్వం నిషేధం విధించినందున తక్షణమే మా విక్స్ యాక్షన్ 500 ఎక్స్‌ట్రా తయారీ, అమ్మకాలను నిలిపివేస్తున్నాం.’ అని మంగళవారం ఓ ప్రకటనలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు పిఅండ్‌జి తెలిపింది. కాగా, సోమవారం ఔషధరంగ దిగ్గజాలైన ఫైజర్, అబ్బోట్ సంస్థలు కూడా ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్‌లో ఉన్న తమ పాపులర్ దగ్గు మందులైన కొరెక్స్, ఫెనె్సడిల్ అమ్మకాలను నిలిపివేశాయి. కొరెక్స్ సిరప్ అమ్మకాల ద్వారా గత ఏడాది ఏప్రిల్-డిసెంబర్ మధ్య 176 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఫైజర్ అందుకోవడం గమనార్హం. అయితే మార్కెట్‌లో విశేష ఆదరణ పొందిన తమ ఔషధాలు ఇలా నిషేధం పరిధిలోకి వచ్చిన క్రమంలో ప్రత్యామ్నాయ మార్గాలపై ఔషధరంగ సంస్థలు దృష్టిసారించాయి.