బిజినెస్

సమీప భవిష్యత్తులో సంస్కరణల అమలు అంతంతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత్‌లో సంస్కరణలు మందగించనున్నాయని, వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను గత నెల 29న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన సాధారణ వార్షిక బడ్జెట్ ఇందుకు నిదర్శనమని గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ వ్యాఖ్యానించింది. దేశ ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టించగల సంస్కరణలేవీ ఉండవని మరోమారు బడ్జెట్ తేల్చి చెప్పిందని బుధవారం పేర్కొంది. ఈ ఏడాది ఆరంభం నుంచి తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లకు తాజా బడ్జెట్ వల్ల ఒరిగిందేమీ లేదంది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల పతనం, ముఖ్యంగా చైనా మార్కెట్ల నష్టాలు, గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరల క్షీణత, డాలర్‌తో పోల్చితే దిగజారుతున్న రూపాయి మారకం విలువతోపాటు దేశీయంగా బడ్జెట్ మదుపరులను నిరుత్సాహపరుస్తున్నాయని పేర్కొంది. ఈ క్రమంలో మున్ముందు సంస్కరణల విషయంలో భారత ప్రభుత్వం తీరు.. మదుపరులను విసుగుపుట్టించేలా ఉంటుందని అభిప్రాయపడింది.