బిజినెస్

ఫిబ్రవరిలో 5.37 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో భాగంగా ఫిబ్రవరిలో కూడా 5.37 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసినట్టు సింగరేణి సిఎండి ఎన్ శ్రీ్ధర్ తెలిపారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ఈ ఆర్థిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు కార్మికులంతా కలసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
మంగళవారం ఆయన విలేఖరుల తో మాట్లాడుతూ గడచిన 11 నెలల కాలంలో రికార్డు స్థాయిలో 54.34 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగిందని, గత ఆర్థిక సంవత్సరం కంటే ఇది 18 శాతం అధికమన్నారు. కాగా, ఫిబ్రవరి నెలలో 5.35 మిలియన్ టన్నుల లక్ష్యానికిగానూ 5.37 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి సింగరేణి చరిత్రలోనే సరికొత్త రికార్డుకు నాంది పలికామన్నారు. అదేవిధంగా ఓపెన్ కాస్టులలోని ఓవర్ బర్డెన్ (మట్టితొలగింపు) విషయంలో ఫిబ్రవరి నెల లక్ష్యం 27.68 మిలియన్ క్యూబిక్ మీటర్లయతే, 28.04 మిలియన్ క్యూబిక్ మీటర్ల మేర తొలగించడం జరిగిందన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 44 శాతం అధికమని చెప్పారు.
వంద శాతం ఉత్పాదక రేటు
కొత్తగూడెం: సింగరేణి సంస్థ ప్రస్తుత 2015-16 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధన దిశగా పయనిస్తోంది. ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యం ప్రకారం 55 మిలియన్ టన్నులు ఉత్పత్తి లక్ష్యం కాగా సంస్థ అంతర్గత లక్ష్యం 60.03 మిలియన్ టన్నులు. ప్రభుత్వ లక్ష్యాన్ని అవలీలగా చేధిస్తూ అంతర్గత లక్ష్యసాధన దిశగా కూడా అడుగులు వేస్తోంది. గడచిన 11 మాసాలలో 54.36 మిలియన్ టన్నులు ఉత్పత్తి లక్ష్యం కాగా 54.34 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించి వంద శాతం ఉత్పాదక రేటును ఫిబ్రవరి మాసాంతానికి నమోదు చేసుకుంది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11ఏరియాలలో కొత్తగూడెం ఏరియా 111 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. ఇల్లెందు 110 శాతం, మణుగూరు 104 శాతం, బెల్లంపల్లి 104 శాతం, రామగుండం- 3 101 శాతం, భూపాలపల్లి 101 శాతం, శ్రీరాంపూర్ 101 శాతం, రామగుండం-1 100 శాతం, రామగుండం-2 98 శాతం, ఆడ్రియాల ప్రాజెక్టు 71 శాతం, మందమర్రి 59 శాతం ఉత్పాదకరేటు నమోదైంది.