బిజినెస్

ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులతో విశాఖ-చెన్నై కారిడార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: విశాఖ-చెన్నై మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఎడిబి) ముందుకువచ్చిందని ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. పారిశ్రామిక కారిడార్ నిర్మాణం జరిగితే కోస్తాతీరం అనూహ్యంగా అభివృద్ధి సాధించే అవకాశాలున్నాయన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ఆదివారం పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలపై పరిశ్రమల శాఖ రూపొందించిన బుక్‌లెట్‌ను ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలసి యనమల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రాథమిక రంగంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలోను, తూర్పు గోదావరి జిల్లా నాలుగో స్థానంలోను ఉందన్నారు. పారిశ్రామికంగా విశాఖ జిల్లా అగ్రభాగాన నిలచిందని చెప్పారు. విశాఖ జిల్లా తరువాత పారిశ్రామికంగా కాకినాడ తీరానికి అభివృద్ధికి ఎక్కువ అవకాశాలున్నట్టు పేర్కొన్నారు. విశాఖ-చెన్నై మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటైతే తీరం వెంబడి పారిశ్రామికాభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. కాకినాడ తీరంలో ప్రస్తుతం రెండు పోర్టులు ఉండగా, త్వరలో జిఎంఆర్ ఆధ్వర్యంలో మూడవ ఓడరేవును నిర్మించనున్నట్టు చెప్పారు. తూర్పు తీరంలో ఎగుమతి, దిగుమతులకు కాకినాడ పోర్టు ప్రధాన భూమిక పోషించనున్నదని యనమల పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకువచ్చే ఔత్సాహికులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఏ పరిశ్రమ ఏర్పాటుకైనా ముందుకువస్తే ఏకగవాక్ష విధానంలో 15 రోజుల్లోగా అన్ని రకాల అనుమతులను మంజూరు చేస్తామన్నారు. మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమల స్థాపనకు రాష్ట్రంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఆ దిశగా ఔత్సాహికులు ముందుకు రావాలని ఆయన కోరారు. కాకినాడ, రాజమండ్రి నగరాలకు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేసిందన్నారు. కాకినాడ హోప్ ఐలాండ్‌ను పర్యాటకపరంగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేసినట్టు చెప్పారు. రాజమండ్రి విమానాశ్రయాన్ని 850 ఎకరాలకు విస్తరించడానికి కృషిచేస్తున్నట్టు యనమల చెప్పారు.
ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఇటీవల విశాఖలో నిర్వహించిన ప్రపంచ స్థాయి పారిశ్రామిక సదస్సుకు అనూహ్య స్పందన లభించిందన్నారు. వివిధ సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమలు, యూనిట్ల స్థాపనకు ముందుకువచ్చాయని, ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను తెలియజేస్తూ బుక్‌లెట్ రూపొందించడం పట్ల చినరాజప్ప అధికారులను అభినందించారు. సమావేశంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్, జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షుడు నామన రాంబాబు, ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.