బిజినెస్

తెలంగాణలో ఎక్సైజ్ పన్నుల వసూళ్లు రూ. 12,680 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: హైదరాబాద్ కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ కమిషనరేట్ల పరిధిలో రూ. 12,680 కోట్ల సుంకాన్ని అధికారులు వసూలు చేశారు. పది జిల్లాల్లో గత ఏడాది కంటే ఈ సంవత్సరం రూ. 854 కోట్లు అధికంగా వసూలైనట్టు సెంట్రల్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికిగాను జనవరి వరకు రూ. 12,680 కోట్లు వసూలవగా, 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ. 11,726 కోట్లు వసూలయ్యాయని, అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి మరో 30శాతం అధికంగా ఆదాయం రానున్నట్టు భావిస్తున్నామని కమిషనర్ పేర్కొన్నారు.
కాగా, గురువారం సెంట్రల్ ఎక్సైజ్ డేను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ పాల్గొంటారని, చీఫ్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆర్ శకుంతల సభకు అధ్యక్షత వహిస్తారని వివరించారు. అదేవిధంగా ఆలిండియా స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొన్న క్రీడాకారులను ఈ సందర్భంగా సత్కరించనున్నట్టు పేర్కొన్నారు.

జిడిపి వృద్ధిరేటు 7.4 శాతం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంపై ఫిక్కీ అంచనా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: దేశ ఆర్థిక వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో 7.4 శాతంగా ఉండొచ్చని పారిశ్రామిక సంఘం ఫిక్కీ అంచనా వేసింది. గత నెల కేంద్ర గణాంకాల కార్యాలయం వెల్లడించిన ముందస్తు జిడిపి అంచనా 7.6 శాతం కంటే ఇది 0.2 శాతం తక్కువ. తయారీ, వ్యవసాయ రంగాల్లో నమోదవుతున్న ప్రగతితో 2015-16 జిడిపి ఐదేళ్ల గరిష్ఠాన్ని తాకుతుందని కేంద్ర గణాంకాల కార్యాలయం అభిప్రాయపడింది. అయితే ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి వృద్ధిరేటు 7.4 శాతంగా నమోదు కావచ్చు.’ అని తాజా ఎకనామిక్ ఔట్‌లుక్‌లో ఫిక్కీ పేర్కొంది. బ్యాంకింగ్, పారిశ్రామిక తదితర ఆర్థిక, సేవా రంగాలకు చెందినవారి అభిప్రాయాలతో ఎకనామిక్ ఔట్‌లుక్‌ను ఫిక్కీ రూపొందించింది. దీని ప్రకారం వ్యవసాయ రంగంలో ఈసారి వృద్ధి 1.7 శాతం, పారిశ్రామిక రంగంలో 7.1 శాతం, సేవా రంగంలో 9.7 శాతం ఉంటాయని అంచనా. అలాగే ఏడాదికిపైగా మైనస్‌లోనే నమోదవుతున్న హోల్‌సేల్ ద్రవ్యోల్బణం -1.8 శాతంగా, రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతంగా ఉండొచ్చని పేర్కొంది.

మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో
ఎల్‌ఇడి బల్బుల పంపిణీ

హైదరాబాద్, ఫిబ్రవరి 23: మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఎల్‌ఇడి బల్బులను పంపిణీ చేయాలని తెలంగాణ సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఈ సంస్థ ఐదవ బోర్డు సమావేశం మంగళవారం ఇక్కడ జరిగింది. దీనికి ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ పథకం కింద ప్రతి ఇంటికి 9 వాట్ల సామర్థ్యం ఉన్న రెండు ఎల్‌ఇడి బల్బులు ఇస్తామన్నారు. సాధారణ బల్బుల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను వినియోగించడం వల్ల 8 0శాతం విద్యుత్‌ను ఆదా చేయవచ్చన్నారు. కాగా, రెండు 60 వాట్స్ సాధారణ బల్బులను వినియోగించేవారికి ఎల్‌ఇడి బల్బులు ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. అలాగే ఇంధన భద్రత కోసం ఎల్‌ఇడి బల్బుల వినియోగంపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయనున్నారు. డిమాండ్ సైడ్ ఎఫిషియెంట్ లైటింగ్ కార్యక్రమంలో భాగంగా ఎల్‌ఇడి బల్బులను పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో బోర్డు సంయుక్త కార్యదర్శి జిఎస్ పండా దాస్‌తోపాటు తెలంగాణ సంప్రదాయేతర ఇంధన సంస్థ ఎండి సి శ్రీనివాసరావు, తెలంగాణ సదరన్ డిస్కాం సిఎండి జి రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఏపి జెన్కో డైరెక్టర్‌గా నాగేశ్వరరావు
ఫైనాన్స్ డైరెక్టర్‌గా ఆదినారాయణ

హైదరాబాద్, ఫిబ్రవరి 23: ఆంధ్రప్రదేశ్ జెన్కో డైరెక్టర్‌గా సిహెచ్ నాగేశ్వరరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏపి జెన్కోలో హైడల్ విభాగానికి ఆయన డైరెక్టర్‌గా కొనసాగుతారు. ఏపి జెన్కో ఫైనాన్స్, కమర్షియల్ డైరెక్టర్‌గా జి ఆదినారాయణను, ఏపి జెన్కో థర్మల్ విభాగం డైరెక్టర్‌గా ఎంపీ సురేందర్ సింగ్‌ను నియమిస్తూ జీవో జారీ చేశారు. వీరు ఆ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్నారు.